తెలంగాణ నేపథ్యంలో ‘క్రేజీ కళ్యాణం’.. రెండు వారాల ముందే సినిమా విడుదల

తెలంగాణ నేపథ్యంలో ‘క్రేజీ కళ్యాణం’.. రెండు వారాల ముందే సినిమా విడుదల

నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో బద్రప్ప గాజుల దర్శకత్వంలో  రూపొందిన  చిత్రం  ‘క్రేజీ కళ్యాణం’.  బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 16న  విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత జగన్‌‌‌‌‌‌‌‌ మోహన్ రెడ్డి  మాట్లాడుతూ ‘ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ కథలో యూనివర్సల్ ఎమోషన్స్ ఉంటాయి. కామెడీ, ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌తోపాటు మంచి మెసేజ్ ఇవ్వబోతున్నాం.

ఫీల్‌‌‌‌‌‌‌‌గుడ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్‌‌‌‌‌‌‌‌తో ఆడియెన్స్ థియేటర్స్‌‌‌‌‌‌‌‌ నుంచి బయటికి వస్తారు.  అనుపమ, నరేష్ తమ పాత్రల కోసం తెలంగాణ యాస నేర్చుకున్నారు.  తరుణ్ భాస్కర్ తనదైన నటనతో ఆకట్టుకుంటూ కొన్ని ఇన్‌‌‌‌‌‌‌‌పుట్స్ కూడా ఇచ్చారు. రియల్ లొకేషన్లలో చిత్రీకరణ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సురేష్​ బొబ్బిలి బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు.   బన్నీ వాస్, సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ కలిసి సినిమాను విడుదల చేస్తున్నాయి.  ముందుగా ఈ నెల 30న రిలీజ్ చేయాలని భావించగా, కంటెంట్‌‌‌‌‌‌‌‌పై కాన్ఫిడెన్స్‌‌‌‌‌‌‌‌తోనే రెండు వారాలముందు విడుదల చేస్తున్నాం. ప్రేక్షకుల ఆదరణపై పూర్తినమ్మకంగా ఉన్నాం.