
ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చాలని ఎప్పటి నుంచో వినిపిస్తున్న డిమాండ్. ఎట్టకేలకు ఇప్పుడు ఆ నిర్ణయం దిశగా అడుగులు పడ్డాయి. 2022లో హాంగ్జ్ వేదికగా జరిగే ఈ గేమ్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టాలని ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) నిర్ణయం తీసుకున్నది. ఆదివారం సమావేశమైన OCA సాధారణ అసెంబ్లీ దీనికి గ్రీన్ సిగ్నలిచ్చిందని గౌరవ ఉపాధ్యక్షుడు రణ్‌ధీర్ సింగ్ తెలిపారు. 2010, 2014 ఆసియా గేమ్స్‌లో క్రికెట్ ఉన్నా.. బిజీ షెడ్యూల్ కారణంగా భారత్ ఇందులో పాల్గొనలేదు. దీంతో అభిమానుల ఆదరణ తగ్గడంతో 2018 గేమ్స్ నుంచి ఈ ఆటను తొలగించారు. క్రికెట్‌ను తిరిగి తీసుకురావాలని వోసీఏ తీసుకున్న నిర్ణయాన్ని భారత ఒలింపిక్ సంఘం (OCA) స్వాగతించింది. అయితే ఏ ఫార్మాట్‌ను ఇందులో కొనసాగిస్తారన్న దానిపై స్పష్టత లేదని OCA సెక్రటరీ జనరల్ రాజీవ్ మోహతా చెప్పారు. హాంగ్జ్ గేమ్స్‌కు BCCI పురుషుల, మహిళల జట్లను పంపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య కూడా పెరుగుతుందన్నారు. 2010, 2014 గేమ్స్ మాదిరిగా టీ20 ఫార్మాట్‌నే కొనసాగించే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
మరోవైపు గేమ్స్‌కు చాలా సమయం ఉన్నందున అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పింది బీసీసీఐ.