సాయంత్రం అయితే చాలు : రెండు నెలల్లో.. రూ.15 కోట్ల ఐపీఎల్ బెట్టింగ్

 సాయంత్రం అయితే చాలు : రెండు నెలల్లో..  రూ.15 కోట్ల ఐపీఎల్ బెట్టింగ్

క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని బండ్లగూడ, నార్సింగీ, శంషాబాద్ లలోని మూడు ఇళ్లలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఓటీ బృందం ఆయా ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది.

మూడు ముఠాలు అరెస్ట్... 

ఎస్ ఓ టీ పోలీసులు చేసిన దాడుల్లో మూడు ముఠాల్ని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.2 కోట్ల నగదు, ల్యాప్ టాప్, 36 మొబైళ్లు సీజ్ చేసినట్టు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఆన్ లైన్  ద్వారా వీరు  బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్నారు. మూడు ముఠాలకు సంబంధించి ఏడు మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.  ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల  ఆధ్వర్యంలో బెట్టింగ్ జరుగుతోందని వెల్లడించారు. బెంగళూరు నుంచి మానిటర్ చేస్తున్న ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని స్టీఫెన్ చెప్పారు. రెండు నెలల వ్యవధిలోనే రూ.15 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్నారు.   అదుపులో ఉన్న నిందితులపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.