క్రికేటుగాళ్లు : సోషల్ మీడియా అడ్డాగా క్రికెట్ బెట్టింగ్

క్రికేటుగాళ్లు : సోషల్ మీడియా అడ్డాగా క్రికెట్ బెట్టింగ్

హైదరాబాద్, వెలుగు: వాట్సాప్ లో షేరిం గ్స్, ఆన్ లైన్ లో మనీ ట్రాన్స్ ఫర్స్. టాస్ దగ్గర్నుంచి బాల్, రన్, వికెట్.. ఇలా ఒక్కోదానికి ఒక్కో రేటు. ఇక సిక్సు లు, ఫోర్లకు వేలల్లోనే. ఇదీ ఆన్ లైన్ అడ్డాగా సాగుతున్న క్రికెట్ మాఫియా హైటెక్ బెట్టింగ్ దందా. నేషనల్, ఇంటర్నేషన్ క్రికెట్ మ్యాచ్ లు జరిగే సమయంలో జోరుగా బెట్టింగ్ చేసే ఈ ముఠాలు తాజా ఐపీఎల్ సీజన్​లో మరింత స్పీడు పెంచాయి. వాట్సాప్, ఫేస్ బుక్ లలో కోడ్ భాషలో భారీ బెట్టింగ్స్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే నాలుగు గ్యాంగ్స్ ను అరెస్టు చేసిన హైదరాబాద్ ​సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. నెల రోజులపాటు కొనసాగే ఐపీఎల్ పై గట్టి నిఘా పెట్టారు.

ఏజెంట్ల చైన్ సిస్టమ్

సిటీలోని గ్యాంగ్స్ బెట్టింగ్ దందా అంతా ఏజెంట్ల చైన్ సిస్టమ్ తో నడుస్తోందని దర్యాప్తులో తేలింది.  ఆన్ లైన్​లో రూ.కోట్ల ట్రాన్సాక్షన్స్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అరెస్టయిన ముఠాల నుంచి కీలక వివరాలను రాబట్టారు. పంటర్లు (బెట్టింగ్స్ వేసే వారు)గా ఉన్నవారిని బుకీలు తమ ఏజెంట్లుగా మార్చుతున్నట్లు గుర్తించారు. గోవా, ముంబై, ఢిల్లీ, జైపూర్, యూపీలో బుకీలు ఉన్నారని, అక్కడి నుంచే ఆన్ లైన్ లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారని తేల్చారు .

మోస్ట్ వాంటెడ్ సులేమాన్ సురానీ

సికింద్రాబాద్ లోని సిం ధ్ కాలనీకి చెందిన సులేమాన్ సురానీ మొదట పంటర్ గా బెట్టిం గ్ చేసేవాడు. తర్వాత బుకీగా మారాడు. అటునుంచి ముఠాలు తయారు చేశాడు. 200 మందికి పైగా ఏజెంట్లతో సొంత నెట్ వర్క్ ఏర్పాటు చేసుకు న్నాడు. ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా విదేశాల నుంచే బెట్టింగ్ నడుపుతున్నాడు. పంటర్లు, ఏజెంట్లకు మ్యాచ్ ను బట్టి కమీషన్లు చెల్లిస్తుంటాడు. తన గ్యాంగ్ లో కొందరు పంటర్లను పర్మినెంట్  ఏజెంట్లుగా నియమించి జీతాలు కూడా ఇస్తున్నాడని తెలిసింది.

సిటీలో 15 గ్యాంగ్స్

సిటీలో మరో 15 గ్యాంగ్స్ క్రికెట్ బెట్టిం గ్స్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల మధ్యప్రదేశ్ కు చెందిన అలోక్ జైన్ చిక్కడపల్లిలో పోలీసులకు చిక్కాడు. ఇతడు సులేమన్ గ్యాంగ్ మెంబర్ గా పోలీసులు గుర్తిఃచారు. తన సోదరుడు అభిషేక్ జైన్, గుజరాత్ కు చెందిన మెహుల్ కె.మొర్జా రియాలతో కలిసి చిక్కడపల్లిలో బెట్టింగ్ స్థావరం ఏర్పాటు చేశాడు. అందుకోసం www.msa.abexch.com ఏబీ ఎక్స్చేంజ్ , ఎల్ సీ ఎక్స్చేంజ్ వెబ్ సైట్లను క్రియేట్ చేశారు. వీరిని పోలీసులు ఇటీవల అరెస్టు చేసి రూ.41.2 లక్షల నగదు, ఆరు సెల్ ఫోన్లు , టీవీ స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 5న కూడా సికింద్రాబాద్ లోని బోయిన్​పల్లిలో మరో ఇద్దరు బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. www. cricketmazza.com పేరుతో ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేసి రూ.1.50 లక్షల నగదు స్వాధీనం చేసుకు న్నారు. బేగంబజార్ సమీపంలోని  ఫీల్ ఖానాలో  రెండేళ్లుగా నడుస్తున్న బెట్టింగ్ ముఠాను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సూరజ్ వ్యాస్ అనే యువకుడిని అరెస్ట్ చేసి, రూ.5.38 లక్షలు, ఫోన్లు స్వాధీనం చేసుకు న్నారు.