
లండన్: వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్.. కుడి చేతి బొటన వేలి గాయంతో ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో ఆర్చర్ ప్లేస్‌లో ల్యూక్ వుడ్‌ను టీమ్‌లోకి తీసుకున్నారు. రాబోయే వారం రోజుల్లో పేసర్ గాయాన్ని అంచనా వేసి తిరిగి జట్టులోకి ఎప్పుడు వస్తాడనే అంశంపై ఈసీబీ క్లారిటీ ఇవ్వనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈ నెల 29న ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి పోరు జరగనుంది. 2019లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి వచ్చినప్పట్నించి ఆర్చర్ వరుసగా మోచేతి, వెన్ను గాయాలతో తీవ్ర ఇబ్బందిపడ్డాడు. ఇక ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ తరఫున తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన ఆర్చర్ తమ జట్టు నాకౌట్ దశకు చేరుకోకపోవడంతో మళ్లీ తిరిగి రాలేదు.