V6 News

టీమిండియా చీఫ్‌ సెలెక్టర్‌గా చేతన్‌ శర్మ

టీమిండియా చీఫ్‌ సెలెక్టర్‌గా చేతన్‌ శర్మ
సెలెక్టర్లుగా కురివిల్లా, దెబాశీష్‌‌‌‌ అహ్మదాబాద్‌‌‌‌:  ఆలిండియా సీనియర్‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌ ప్యానెల్‌‌‌‌లో ఖాళీగా ఉన్న మూడు పోస్టులను మదన్‌‌‌‌ లాల్‌‌‌‌ నేతృత్వంలోని క్రికెట్‌‌‌‌ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) గురువారం భర్తీ చేసింది. చీఫ్‌‌‌‌ సెలెక్టర్‌‌‌‌గా ఇండియా మాజీ పేసర్‌‌‌‌ చేతన్‌‌‌‌ శర్మను నియమించింది. ఐదుగురు మెంబర్ల కమిటీలో మాజీ క్రికెటర్లు అబి కురివిల్లా, దెబాశీష్ మొహంతీని సెలెక్టర్లుగా ఎంపిక చేసింది. సునీల్‌‌‌‌ జోషీ, హర్మీందర్‌‌‌‌ సింగ్‌‌‌‌ ఇప్పటికే మెంబర్లుగా ఉన్నారు. సునీల్‌‌‌‌ జోషీ ఇప్పటిదాకా చీఫ్‌‌‌‌ సెలెక్టర్‌‌‌‌గా ఉన్నారు. అయితే, బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఎక్కువ టెస్టులు ఆడిన మెంబర్‌‌‌‌ చీఫ్‌‌‌‌ సెలెక్టర్‌‌‌‌గా ఉండాలి. సునీల్‌‌‌‌ 15 టెస్టులు ఆడగా.. చేతన్‌‌‌‌ 23 మ్యాచ్‌‌‌‌లు ఆడాడు. దాంతో, సీనియారిటీ ప్రాతిపదికన చేతన్‌‌‌‌కు సీఏసీ  చీఫ్‌‌‌‌ సెలెక్టర్‌‌‌‌ బాధ్యతలు అప్పగించింది. ఆయా జోన్ల నుంచి సెలెక్టర్‌‌‌‌ పోస్టులకు అప్లై చేసుకున్న మొత్తం 11 మందిని సీఏసీ వర్చువల్‌‌‌‌గా ఇంటర్వ్యూ చేసింది. చీఫ్​ సెలెక్టర్​ కోసం అజిత్​ అగార్కర్​ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ చేతన్​ వైపే మొగ్గు చూపింది.