వార్తల్లో నిలిచిన ఇషాన్ కిషన్ న్యూ హెయిర్ స్టైల్.. సోషల్ మీడియాలో చర్చ

వార్తల్లో నిలిచిన ఇషాన్ కిషన్ న్యూ హెయిర్ స్టైల్.. సోషల్ మీడియాలో చర్చ

గుండు గీకుతామమ్మా గుండు.. మొగుడు చచ్చిన గుండైతే రూ. 10లు, మొక్కుబడి గుండైతే రూ. 20లు.. అంటూ విక్రమార్కుడు సినిమాలో బ్రహ్మానందం అరగుండు గీకినందుకు రూ.1,000 వసూలు చేస్తాడు.. గుర్తుందా! ప్రస్తుతం టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ కొత్త హెయిర్ స్టైల్ ఖర్చు అచ్చం ఇలానే ఉంది. పిచ్చి కాకుంటే క్షవరానికి వేలల్లో ఫీజు ఏంటండీ..! పోనీ కొత్త జుట్టు మొలిపించాడు అంటే ఇచ్చినా పర్లేదు. కానీ ఉన్నదాంట్లో అటూ ఇటూ లేపేసి.. మధ్యలో అలానే వదిలేసి వేలల్లో వసూలు చేశాడట.

వెస్టిండీస్ పర్యటన నుండి తిరిగి స్వదేశానికి చేరుకున్న ఇషాన్.. తాజాగా బాంద్రాలోని సెలబ్రిటీ హెయిర్‌డ్రెస్సర్ హకీమ్ ఆలిమ్ హెయిర్ లాంజ్‌ను సందర్శించాడు. అక్కడ అతడు ఫంకీ హ్యారీకట్‌ అనే కొత్త హెయిర్ స్టైల్ చేపించాడు. అందుకు సంబంధించిన ఫోటోలను ఇషాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి. అయితే దీనిపై నెటిజెన్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చే మొదలుపెట్టారు.

ఇషాన్ కిషన్ న్యూ హెయిర్ స్టైల్ కాస్ట్ రూ. 25వేలని సమాచారం. ఈ విషయం తెలిసిన నెటిజెన్స్ హెయిర్ స్టైల్‌కు 25వేలా? అని నోరెళ్ల పెడుతున్నారు. మరికొందరైతే.. మా ఊర్లో అయితే 150 మించి కాదని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా ఇషాన్ కిషన్ న్యూ హెయిర్ స్టైల్  సోషల్ మీడియాలో మంట పెట్టిందన్నది వాస్తవం.