కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం చూస్తున్నారా..? మీకు బ్యాడ్ న్యూస్..! ఇప్పట్లో లేనట్టే..!

కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం చూస్తున్నారా..? మీకు బ్యాడ్ న్యూస్..! ఇప్పట్లో లేనట్టే..!

ఏ ముహూర్తాన పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం మొదలైందో కానీ... ఆ దెబ్బతో ప్రపంచ దేశాలన్నీ విలవిలలాడుతున్నాయి. ప్రస్తుతం ఉద్రిక్తతలు కాస్త తగ్గినప్పటికీ మాములు పరిస్థితి అయితే లేదు. అడపాదడపా ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కొత్త  LPG కనెక్షన్ కోసం చేస్తున్నవారికి మరికొంతకాలం నిరీక్షణ తప్పేలా లేదు.న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నైలలోని పంపిణీదారులు, డొమెస్టిక్ గ్యాస్ కొత్త కనెక్షన్లు మార్చి నుంచి ఇవ్వట్లేదు.

పశ్చిమాసియా యుద్ధం పీక్స్ లో ఉన్నప్పుడు విధించిన ఆంక్షలు ఎత్తేసినప్పటికీ.. నెలలు గడుస్తున్నా కొత్త గ్యాస్ కనెక్షన్ల కోసం చేసుకున్న దరఖాస్తులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి.

కేంద్రం క్లారిటీ:

అయితే.. కొత్త గ్యాస్ కనెక్షన్లపై ఆందోళన చెందుతున్నవారికీ క్లారిటీ ఇచ్చింది కేంద్రం. ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పంపిణీదారులు నిత్యావసర సేవలకు అంతరాయం కలగకుండా చూసేందుకు ఇప్పటికే ఉన్న కస్టమర్లకు రీఫిల్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపింది. ఇది తాత్కాలిమేనని.. సాధారణ పరిస్థితులు నెలకొన్నాక కొత్త కనెక్షన్లు యధావిధిగా ఇస్తారని పేర్కొంది కేంద్రం.

ఫెడరేషన్ ఆఫ్ ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి పవన్ సోని మాట్లాడుతూ.. ప్రస్తుతం గ్యాస్ సప్లై గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని... త్వరలోనే కొత్త గ్యాస్ కనెక్షన్లు జారీ చేస్తామని అన్నారు.

ఢిల్లీలో ఉన్న ఒక్కో డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొత్త కనెక్షన్ల కోసం సగటున 100 నుండి 120 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని అంటున్నారు. అయితే.. ఈ దరఖాస్తుల్లో చాలామంది తాత్కాలికంగా ఫ్రీ ట్రేడ్ సిలిండర్ తీసుకోవడానికి బదులు కొత్త కనెక్షన్ కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.

పలువురు పంపిణీదారులు, కొత్త కనెక్షన్ కోసం వస్తున్నవారికి తాత్కాలికంగా ఫ్రీ ట్రేడ్ ఐదు కేజీల సిలిండర్లు, పది కేజీల కాంపోజిట్ సిలిండర్లను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.