హిట్ మ్యాన్ కు ప్రముఖుల బర్త్ డే విషెస్

హిట్ మ్యాన్ కు ప్రముఖుల బర్త్ డే విషెస్

న్యూఢిల్లీ: ఫ్యాన్స్ ముద్దుగా హిట్ మ్యాన్ అని పిలిచే టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కు క్రీడా ప్రముఖులు, బోర్డులు బర్త్​డే విషెస్ చెప్పారు.  గురువారంతో 33వ పడిలోకి అడుగిడనున్న రోహిత్ ను విష్ చేస్తూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు వెల్లువెత్తాయి. ‘హ్యాపీ బర్త్ డే శర్మ. ఈ ఏడాది నీకు గొప్పగా ఉండాలి. నీతోపాటు నీ ఫ్యామిలీ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ఇండియా టీమ్ కోచ్ రవిశాస్త్రి ట్వీట్ చేశాడు. రోహిత్ జన్మదినం సందర్భంగా 2016లో వాకాలో రోహిత్ (171 నాటౌట్) ఇన్నింగ్స్ ను గుర్తు చేస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా ఓ వీడియోను పోస్ట్ చేసింది. ‘ఈ కఠిన పరిస్థితుల్లో ఇంటి దగ్గరే సేఫ్​ గా ఉంటూ కేక్ ను బేక్ చేసుకో’ అని సీనియర్ లెఫ్టాండర్ సురేష్ రైనా ట్వీట్ చేశాడు. బీసీసీఐతోపాటు ముంబై ఇండియన్స్ హిట్ మ్యాన్ కు ట్విట్టర్ లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ‘హ్యాపీ బర్త్ డే. నీకు ఈ ఏడాది గొప్పగా సాగాలి’ అని హనుమ విహారి ట్వీట్ చేశాడు.