వరల్డ్ కప్ : క్రికెటర్ల ఫ్యామిలీ అనుమతిపై షరతులు

వరల్డ్ కప్ : క్రికెటర్ల ఫ్యామిలీ అనుమతిపై షరతులు

న్యూఢిల్లీ: విదేశీ టూర్లకు వెళ్లేప్పుడు టీమిండియా క్రికెటర్లు తమ వెంట భార్య, కుటుంబ సభ్యులను తీసుకెళ్తున్నారు. బ్యాచిలర్‌ ఆటగాళ్లు కొందరు తమ గాళ్‌ ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను వెంటబెట్టు కెళ్లడం సహజమే. అయితే, ఇంగ్లండ్‌ లో జరిగే వన్డే వరల్డ్‌ కప్‌ లో పాల్గొనేందుకు టీమిండియా క్రికెటర్లు, సహాయ సిబ్బంది ఒంటరిగానే బయల్దేరనున్నారు. ఈ మెగా టోర్నీ మొదలైన 21రోజుల తర్వాతే వైఫ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ , గాళ్‌ ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ , ఫ్యామిలీ మెంబర్స్‌ క్రికెటర్లతో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించిందని సమాచారం. అది కూడా గరిష్ట గా15 రోజుల పాటే ఉండాలన్న షరతు విధించింది. దాంతో, జూన్‌ 16న సాకిస్థాన్‌ తో జరిగే మ్యాచ్‌ ను ఇండియా క్రికెటర్ల ఫ్యామిలీలు మిస్‌ కానున్నా యి. అయితే, ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏ టైమ్‌ లో తమతో ఉండొచ్చో ఎంచుకునే ఆప్షన్‌ క్రికెటర్లకు బోర్డు ఇవ్వనుంది.

విరాట్‌ తన భార్య అనుష్క శర్మ టోర్నీ చివర్లో ఇంగ్లండ్‌ లో ఉండాలనుకుంటే, నాకౌట్‌ మ్యాచ్‌ లు జరిగే చివరి 15 రోజులను అతను ఎంచుకోవాల్సి ఉంటుంది. కెప్టెన్‌ కోహ్లీ అభిప్రాయం కోరకుండానే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా టూర్‌ సందర్భంగా క్రికెటర్ల కుటుంబ సభ్యులకు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పా ట్లు , మ్యాచ్‌ పాస్‌ ల కేటాయింపు విషయంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బోర్డు వరల్డ్‌ కప్‌ కు ఈ గైడ్‌ లైన్స్‌  ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన జూన్‌ 22న అఫ్ఘానిస్తాన్‌ తో జరిగే మ్యాచ్‌ కు ముందు మాత్రమే క్రికెటర్ల ఫ్యామిలీలను బీసీసీఐ అనుమతించనుంది.