థ్రిల్లింగ్గా మూడో టెస్టు.. సౌతాఫ్రికా 210 ఆలౌట్

 థ్రిల్లింగ్గా మూడో టెస్టు.. సౌతాఫ్రికా 210 ఆలౌట్
  • 7 టెస్టు ఇన్నింగ్స్ లో బుమ్రా ఐదు వికెట్ల హాల్ సాధించడం ఇది ఏడోసారి
  • జస్​ప్రీత్​కు ఐదు వికెట్లు
  • ఇండియా సెకండ్‌ ఇన్నింగ్స్‌ 57/2
  • థర్డ్‌ టెస్టులో థ్రిల్లింగ్‌ ఫైట్‌

కేప్‌‌‌‌టౌన్‌‌: బౌలర్ల హవా నడుస్తున్న మూడో టెస్టులో ఇండియా, సౌతాఫ్రికా నువ్వా నేనా అన్నట్టుగా ఆడుతున్నాయి. ఫస్ట్‌‌ డే హోమ్‌‌టీమ్‌‌దే కాస్త పైచేయి అవగా.. సెకండ్‌‌ డే బుధవారం  టీమిండియా సత్తా చాటింది. పేసర్‌‌ జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా (5/42) ఐదు వికెట్లతో సూపర్‌‌ పెర్ఫామెన్స్‌‌ చేయడంతో ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌లో సౌతాఫ్రికా 210 రన్స్‌‌కే ఆలౌటైంది. దాంతో, ఇండియాకు 13 రన్స్‌‌ లీడ్‌‌ దక్కింది.  సఫారీ టీమ్‌‌లో కీగన్‌‌ పీటర్సన్‌‌ (72) ఫిఫ్టీతో పోరాడగా.. బుమ్రాకు తోడు షమీ (2/39), ఉమేశ్‌‌ (2/64) రాణించారు. ఆపై, చిన్న లీడ్‌‌తో సెకండ్ ఇన్నింగ్స్‌‌ స్టార్ట్‌‌ చేసిన ఇండియా రెండో రోజు చివరకు 17 ఓవర్లలో 57/2 స్కోరుతో నిలిచింది. ఓవరాల్‌‌గా 70 రన్స్‌‌ లీడ్‌‌లో కొనసాగుతోంది. ఓపెనర్లు కేఎల్‌‌ రాహుల్‌‌ (10), మయాంక్‌‌ (7) మళ్లీ ఫెయిలయ్యారు. రబాడ బౌలింగ్‌‌లో మయాంక్‌‌, జాన్సెన్‌‌ బౌలింగ్‌‌లో రాహుల్‌‌ వరుస ఓవర్లలో ఔటవడంతో 24/2తో ఇండియా కష్టాల్లో పడ్డది. అయితే, కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ (14 బ్యాటింగ్‌‌), మరో సీనియర్‌‌ పుజారా (9 బ్యాటింగ్‌‌) ఓపిగ్గా ఆడుతూ డే ముగించారు. థర్డ్‌‌డే కూడా ఈ ఇద్దరే కీలకం కానున్నారు. వీళ్లు మంచి పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ చేసి.. హోమ్‌‌టీమ్‌‌కు కనీసం 300 రన్స్‌‌ టార్గెట్‌‌ ఇస్తే ఇండియాకు చాన్స్‌‌ ఉంటుంది. తొలి ఇన్నింగ్స్‌‌లో ఇండియా 223 రన్స్‌‌ చేసిన సంగతి తెలిసిందే.
బౌలర్లు సూపర్‌‌..
బ్యాటర్లు తక్కువ స్కోరు చేసిన వికెట్‌‌పై  ఇండియా బౌలర్లు సూపర్‌‌ పెర్ఫామెన్స్‌‌ చేశారు. బుమ్రా తనదైన స్టయిల్లో పేస్‌‌ అటాక్‌‌ను ముందుండి నడిపించగా... షమీ, ఉమేశ్‌‌ కూడా హోమ్‌‌టీమ్‌‌ను దెబ్బకొట్టారు. ఓ టైమ్‌‌లో 112/3 స్కోరుతో భారీ స్కోరు చేసేలా కనిపించిన సఫారీలను రిస్ట్రిక్ట్‌‌ చేశారు. ఓవర్‌‌నైట్‌‌ స్కోరు 17/1తో  హోమ్‌‌టీమ్‌‌ డే స్టార్ట్‌‌ చేయగా.. బుమ్రా రెండో బాల్​కే అద్భుత డెలివరీతో ఓపెనర్‌‌ మార్‌‌క్రమ్‌‌ (8)ను బౌల్డ్‌‌ చేశాడు. ఆఫ్‌‌ స్టంప్‌‌పై పిచ్‌‌ అయిన మార్‌‌క్రమ్‌‌ వదిలేయగా.. అనుకున్నంత బౌన్స్‌‌ కాని ఆ బాల్‌‌ వికెట్‌‌ పడగొట్టింది. ఆ తర్వాత మరో ఓవర్‌‌నైట్‌‌ బ్యాటర్‌‌ కేశవ్‌‌ మహారాజ్‌‌ (25)ను ఉమేశ్‌‌ బౌల్డ్‌‌ చేశాడు. ఈ టైమ్‌‌లో  డుసెన్‌‌ (21)తో కీగన్‌‌ పీటర్సన్​ ఇన్నింగ్స్‌‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ ఇద్దరికీ అదృష్టం కూడా తోడైంది. షమీ, ఠాకూర్‌‌ బౌలింగ్‌‌లో ఎడ్జ్‌‌లు వచ్చినా అవి  ఫీల్డర్స్‌‌ చేతుల్లోకి వెళ్లలేదు.

ఈ చాన్స్‌‌లను యూజ్‌‌ చేసుకున్న ఇద్దరూ వరుసగా బౌండ్రీలు కొడుతూ 100/3 స్కోరుతో టీమ్‌‌ను లంచ్‌‌కు తీసుకెళ్లారు. అయితే, లంచ్‌‌ బ్రేక్‌‌ నుంచి వచ్చిన కొద్దిసేపటికే డుసెన్‌‌ను ఔట్‌‌ చేసిన ఉమేశ్‌‌ థర్డ్‌‌ వికెట్‌‌కు 67 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ను బ్రేక్‌‌ చేశాడు. ఇండియా పేసర్లు ఇబ్బంది పెట్టినా  వెనక్కుతగ్గని కీగన్‌‌ ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేసుకోగా.. మరో ఎండ్‌‌లో ఇన్‌‌ఫామ్‌‌ బ్యాటర్‌‌ బవూమ తనకు సపోర్ట్ ఇచ్చాడు. 17 రన్స్‌‌ వద్ద అతనిచ్చిన క్యాచ్‌‌ను స్లిప్‌‌లో పుజారా డ్రాప్‌‌ చేశాడు. కీగన్‌‌, బవూమ ఇద్దరూ క్రీజులో కుదురుకోవడంతో భారీ స్కోరు చేసేలా కనిపించింది. ఈ టైమ్‌‌లో షమీ మ్యాజిక్‌‌ చేశాడు. మూడు బాల్స్‌‌ తేడాలో బవూమతో పాటు వెరైన్‌‌ (0)ను పెవిలియన్‌‌ చేర్చి ఇండియాను  రేసులోకి తెచ్చాడు. టీకి ముందు బుమ్రా బౌలింగ్‌‌లో జాన్సన్‌‌ (7) క్లీన్​ బౌల్డ్‌‌ అయ్యాడు. సఫారీ టీమ్‌‌ 175/7తో  టీ బ్రేక్‌‌ నుంచి వచ్చిన వెంటనే బుమ్రా మరో స్ట్రోక్‌‌ ఇచ్చాడు. సెంచరీ దిశగా ముందుకెళ్తున్న పీటర్సన్‌‌ను ఎక్స్‌‌ట్రా బౌన్స్‌‌తో వేసిన లెంగ్త్‌‌ బాల్‌‌తో పెవిలియన్‌‌ చేర్చాడు. మన బౌలర్ల జోరు చూస్తే హోమ్‌‌టీమ్‌‌ 200లోపే ఆలౌటయ్యేలా కనిపించింది.  కానీ, చివర్లో రబాడ (15), ఒలివర్‌‌(10 నాటౌట్‌‌) కాసేపు ఫైట్‌‌ చేశారు. ఠాకూర్‌‌ బౌలింగ్‌‌లో రబాడ ఔటగా.. ఎంగిడి (3)ని పెవిలియన్​ చేసిన బుమ్రా ఐదు వికెట్లు ఖాతాలో వేసుకోవడంతో పాటు సఫారీ ఇన్నింగ్స్‌‌ను ముగించాడు. 
స్కోర్స్‌‌
ఇండియా ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌: 223 ఆలౌట్‌‌;
సౌతాఫ్రికా ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌: 76.3 ఓవర్లలో 210 ఆలౌట్‌‌ (కీగన్‌‌ 72, బవూమ 28, బుమ్రా 5/42, షమీ 2/39, ఉమేశ్‌‌ 2/64).
ఇండియా సెకండ్‌‌ ఇన్నింగ్స్‌‌: 17 ఓవర్లలో 57/2 (కోహ్లీ 14 బ్యాటింగ్‌‌, పుజారా 9 బ్యాటింగ్‌‌, జాన్సెన్‌‌ 1/7, రబాడ 1/25).
కోహ్లీ@ 100 క్యాచ్‌‌‌‌లు
టెస్ట్‌‌ ఫార్మాట్‌‌లో విరాట్‌‌ కోహ్లీ వంద క్యాచ్‌‌ల క్లబ్‌‌లో చేరాడు. షమీ బౌలింగ్‌‌లో బవూమ క్యాచ్‌‌ను అందుకొని తను ఈ మార్కు దాటాడు. కీపర్‌‌ కాకుండా టెస్టుల్లో వంద క్యాచ్‌‌లు  పట్టిన ఇండియా ఆరో ప్లేయర్‌‌గా కోహ్లీ నిలిచాడు.