తారామతిపేటలో మొసలి కలకలం

తారామతిపేటలో మొసలి కలకలం

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధి తారామతిపేటలో మొసలి కలకలం సృష్టించింది. గురువారం అర్ధరాత్రి తారామతిపేట గ్రామ పరిధి ఔటర్ సర్వీస్ రోడ్డు నుంచి మూసీకి వెళ్లే కాలువ పక్కన ముసలిని స్థానికులు గమనించారు. పోలీసులు అక్కడికి చేరుకుని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకునే లోపే మొసలి తారామతిపేట గ్రామంలోకి ప్రవేశించింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు దానిని బంధించి జూపార్కుకు తరలించారు. ఈ మొసలి 12 ఫీట్ల పొడవు, 120 కిలోల బరువు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.