హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ క్యూర్పరిధిలో నిరుపేదలకు లక్ష ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో కలెక్టరేట్‌లో దరఖాస్తు చేసేందుకు భారీ సంఖ్యలో ఆశావహులు తరలిస్తున్నారు.
ఈ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 1,061 అప్లికేషన్లు రాగా, ఇందులో హౌసింగ్ శాఖకు(ఇందిరమ్మ ఇండ్ల కోసం) సంబంధించినవే 908 ఉన్నాయి. కాగా, ప్రతీ సోమవారం సగటున 1,000 నుంచి 1,500 అప్లికేషన్లు వస్తున్నాయని, ఇందులో 90 శాతం ఇండ్ల దరఖాస్తులే ఉంటున్నాయని అధికారులు తెలిపారు. ఈ దరఖాస్తులు తీసుకునేందుకు, అనుమానాల నివృత్తికి ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
