క్రూడాయిల్ @ 100 డాలర్లు.. ఎర్ర సముద్రంలో సౌదీ నౌకలపై హౌతీ రెబల్స్ దాడులు

క్రూడాయిల్ @  100 డాలర్లు.. ఎర్ర సముద్రంలో సౌదీ నౌకలపై హౌతీ రెబల్స్ దాడులు

న్యూఢిల్లీ: బ్రెంట్ క్రూడాయిల్ ధర గత రెండు నెలల్లో మొదటిసారిగా  100 డాలర్లను దాటింది. ఒకవైపు   హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, మరోవైపు ఎర్ర సముద్రంలో రవాణాకు అంతరాయం ఏర్పడుతోంది.   ఎర్రసముద్రంలో నౌకలపై  హౌతీ రెబల్స్‌‌‌‌ దాడి చేస్తే దానికి ఇరాన్‌‌‌‌దే బాధ్యత అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. 

రాత్రి సమయంలో హౌతీలు రెండు సౌదీ అరేబియా నౌకలపై కాల్పులు జరిపారని ఆయన తెలిపారు. దాడులు కొనసాగితే తీవ్ర సైనిక చర్య తప్పదని హెచ్చరించారు. చమురు ఎగుమతులకు కీలకమైన బాబ్ అల్-మండేబ్ ప్రాంతంలో సౌదీ నౌకలను దిగ్బందిస్తామని హౌతీలు ప్రకటించారు. 

దీంతో చమురు సరఫరాకు అంతరాయం కలుగుతుందనే భయాలతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర గురువారం 6.9శాతం పెరిగి 100.6 డాలర్లకు చేరింది. అమెరికా క్రూడాయిల్ డబ్ల్యూటీఐ ధర 5.37 శాతం పెరిగి 92 డాలర్లను దాటింది.  ఈ ఏడాది పొడవునా చమురు ధర బ్యారెల్‌‌‌‌కు 85 డాలర్లకు పైనే ఉండవచ్చని ఆక్స్‌‌‌‌ఫర్డ్ ఎకనామిక్స్ హెచ్చరించింది.