గ్లోబల్ సమిట్కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి : సీఎస్ రామకృష్ణారావు

గ్లోబల్ సమిట్కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి : సీఎస్ రామకృష్ణారావు
  • అధికారులకు సీఎస్​ రామకృష్ణారావు ఆదేశం

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8, 9 తేదీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సీఎస్​ కె. రామకృష్ణ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్లోబల్ సమిట్ నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేశ్ రంజన్, సబ్యసాచి ఘోష్, సంజయ్ కుమార్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి తదితర ఉన్నతాధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణా రావు మాట్లాడారు.

 ఈ సమిట్ లో పాల్గొనే ప్రముఖులు, దేశ, విదేశీ అతిథులకు ఆహ్వానాలు పంపించడం జరుగుతోందని, ఈ సమిట్ కు హాజరయ్యే వారికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేయాలని సూచించారు. ఈ సమిట్ ఏర్పాట్లపై ప్రత్యేకంగా ప్రజా భావన్ లో వార్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వివరించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్​లో పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. డిసెంబర్ 13 వరకు ఈ సమిట్ కొనసాగుతుందని, అదే రోజు ఉప్పల్ స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ తో ముగుస్తుందని వెల్లడించారు.