జీవో ఉద్దేశం ఏంటి? రాసిందేంటి?

జీవో ఉద్దేశం ఏంటి? రాసిందేంటి?

కోర్టు ధిక్కరణ కేసుల కోసం 58 కోట్ల కేటాయింపుపై హైకోర్టుకు వివరణ ఇచ్చారు సీఎస్ సోమేష్ కుమార్. 58 కోట్లు తనపై ఉన్న ధిక్కరణ కేసుల కోసం కేటాయించలేదన్నారు. కోర్టు ధిక్కరణ కేసుల్లో భూ సేకరణ పరిహారం చెల్లింపు కోసమేనని స్పష్టం చేశారు సీఎస్. విచారణ సందర్భంగా వాస్తవాలు కోర్టు ముందు ఉంచలేకపోయామన్నారు సీఎస్. నిధుల విడుదలను ఆపాలన్న ఆదేశాలను ఉపసంహరించుకోవాలని హైకోర్టును కోరారు. పిల్ పై అత్యవసర చేపట్టాలని హైకోర్టును కోరారు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్. జీవో రాసిన తీరుపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఉద్దేశం ఏంటి, కాగితంపై రాసిందేంటని ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ కేసుల కోసమే అన్నట్లు జీవో కనిపిస్తోందని కామెంట్ చేసింది. జీవో ఎలా రాశారో న్యాయ శాఖ చూడాలి కదా అని క్వశ్చన్ చేసింది. దీనిపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.