ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండండి

ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండండి

హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొని ఉన్న తీవ్ర ఎండల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నేడు జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖల అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలనిసీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. రానున్న రెండు రోజుల్లో ఉత్తర తెలంగాణా జిల్లాలతోపాటు నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్ తదితర జిల్లాల్లో 2 నుంచి 4 డిగ్రీల మేరకు ఉష్టోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, అన్ని ఆసుపత్రుల్లో వైదులు, సిబ్బందిని అప్రమత్తం చేయాలని అన్నారు.

అదేవిధంగా సరిపడా ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని, ఎండ తీవ్రత వల్ల ఏవిధమైన ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో 108 వాహనాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. పాఠశాలల సమయాన్ని మరింత తగ్గించాలని, ఉపాధి హామీ కూలీలు ఎండలో పని చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాల కలెక్టర్లతోపాటు ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, పంచాయతీ రాజ్, విద్యా శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, డిజాస్టర్ మేనేజ్మెంట్ కమీషనర్ మాణిక్ రాజ్, భారత వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న తదితరులు పాల్గొన్నారు.

For More News..

ఏపీలో కరెంట్ బిల్లుల పెంపు.. తెలంగాణకు ఏపీకి తేడా ఇదే!

ప్రభుత్వ వాహనాలకు కూడా స్టిక్కర్లు తీసేయాలి

ఈటల లేని పార్టీ తండ్రి లేని కుటుంబంలా మారింది