ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ

ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ

సీఎం ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు సీఎస్ సోమేష్ కుమార్.  ప్రతి మండలానికి చెందిన స్పెషల్ ఆఫీసర్ నర్సరీలను సందర్శించి మొక్కలు బతికేలా చూడాలని  కోరారు.ఇంటిగ్రేటెడ్ వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ కోసం అనువైన స్థలాలను వ్యక్తిగతంగా పరిశీలించి ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. రాబోయే ఆరు నెలల్లో ఈ మార్కెట్లను పూర్తి చేయడానికి కృషి చేయాలని కోరారు. ధరణిలో చేసిన అద్భుతమైన కృషికి కలెక్టర్లను అభినందించారు. పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా క్లియర్ చేయాలని కోరారు. కోవిడ్ ప్రోటోకాల్ ను ఖచ్చితంగా పాటించాలని మరియు మతపరమైన కార్యక్రమాలు, వేడుకలకు కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించడాన్ని అమలు చేయాలన్నారు. గ్రామ స్థాయిలో తగినంత సంఖ్యలో వరి సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఏ ఒక్క రైతు అసౌకర్యానికి గురికాకుండా కలెక్టర్లు చూడాలని ఆయన సూచించారు.