31 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి

31 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి

రాష్ట్రంలో పనిచేస్తున్న31 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

డిప్యూటీ కలెక్టర్లుగా పని చేస్తున్న ఆర్ డి మాధురి, రోహిత్ సింగ్, పద్మశ్రీ, గుగులోతు లింగ్యా నాయక్, మహమ్మద్ అసదుల్లా, రవికుమార్, రాజ్యలక్ష్మి, స్వర్ణలత, వెంకటేశ్వర్లు, భుజంగరావు, వెంకట మాధవరావు, వెంకట భూపాల్ రెడ్డి, శ్రీనివాసులు, తిరుపతిరావు, మహేందర్, గంగాధర్, కిషన్ రావు, సూరజ్ కుమార్, వెంకట చారి, విక్టర్, కిషోర్ కుమార్, అశోక్ కుమార్, విజయలక్ష్మి, శ్రీనివాస్, విజయేందర్ రెడ్డి, శ్యామలాదేవి, వీర బ్రహ్మచారి, లక్ష్మీ కిరణ్, హరి ప్రియ, వేణు, సంగీతలకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ లుగా పదోన్నతి కల్పించింది.