రాణించిన స్పిన్ త్రయం.. చెన్నైకు ఐదో విక్టరీ

రాణించిన స్పిన్ త్రయం.. చెన్నైకు ఐదో విక్టరీ

9/3… 47/6… 79/9…
చెన్నైసూపర్‌ కింగ్స్‌ తో మ్ యాచ్‌ లో కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ స్కోర్లు ఇవి. మూడు ఓవర్లు ముగిసే సరికే రైడర్స్‌ 9 పరుగులకు 3 వికెట్లు ‌కోల్పోయింది. 11వ ఓవర్‌ కు వచ్చేసరికి స్కోరు పెద్దగా పెరగకపోయినా.. వికెట్లు మాత్రం రెట్టింపయ్యాయి. ఆ తర్వాత కూడా అదే బాటలో నడిచిన కార్తీక్‌ గ్యాంగ్‌‌ మరో 3 వికెట్లు పోగొట్టుకుంది. స్టార్టింగ్‌‌లో దీపక్​ చహర్‌ చెలరేగితే.. మిడిల్‌ లో వెటరన్‌ జోడీ హర్భజన్‌ , తాహిర్‌ విజృంభించడంతో రైడర్స్‌ కోలుకోలేకపోయింది. ఆఖర్లో ఆండ్రీ రసెల్‌ బ్ యాట్‌ కు పనిచెప్పడంతో సెంచరీ మార్క్‌‌ దాటినా.. కోల్‌ కతా బౌలింగ్‌‌లోనూ పెద్దగా ఆకట్టుకోలేక లీగ్‌‌లో రెండో ఓటమి మూటగట్టుకుంది. ఆడిన ఐదు మ్యాచ్‌ ల్లో నాలుగింట గెలిచి పాయింట్స్‌ టేబుల్‌ టాప్​లో ఉన్న కోల్‌ కతా ఈ పరాజయంతో తమ ప్లేస్‌ ను చెన్నైకి అప్పజెప్పింది.

సీజన్‌ ఆరంభం నుంచి విజయవంతంగా దూసుకెళ్తూ.. పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న రెండు టీమ్‌లమధ్య మ్యాచ్‌ అంటే రసవత్తర పోరు ఖాయం అనుకున్నారంతా. కానీ, అందుకు భిన్నంగా చెన్నై సూపర్‌కింగ్స్‌‌ బౌలర్లు బెంబేలెత్తించడంతో కోల్‌ కతా నైట్‌రైడర్స్‌‌కు ఘోర పరాజయం తప్పలేదు. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌ లో చెన్నై 7 వికెట్ల తేడాతో కోల్‌కతాను చిత్తుచేసింది. ధోనీ టాస్‌ గెలిచినా.. గతమ్యాచ్‌ల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని రసెల్‌ కుఛేజింగ్‌ చాన్స్‌‌ ఇవ్వకుండా మొదట బౌలింగ్‌ ఎంచుకున్నాడు. కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెడుతూ.. సొంతగడ్డపై బౌలర్లు చెలరేగిపోవడంతో సూపర్‌ కింగ్స్‌‌ వన్‌ సైడ్‌ విజయం సాధించింది. మొదట నైట్‌ రైడర్స్‌‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 108 రన్స్‌‌ చేసింది. టాపార్డర్‌ ఘోరంగా విఫలం కాగా.. విధ్వంసానికి కేరాఫ్‌ అడ్రస్‌ఆండ్రీ రసెల్‌ (44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50నాటౌట్‌ ) అజేయంగా నిలిచి జట్టుకు ఆ మాత్రం స్కోరైనా అందించాడు. కుర్ర పేసర్‌ దీపక్‌ చహర్‌(3/20)  చిచ్చర పిడుగులా చెలరేగితే.. సీనియర్‌ స్పిన్నర్లు హర్భజన్‌ (2/15), తాహిర్‌ (2/21) గింగిరాలు తిప్పే బంతులతో బ్యాట్స్‌‌మెన్‌కు నిద్రలేని రాత్రినిమిగిల్చారు . చిన్న టార్గెట్‌ ఛేజింగ్‌ లో చెన్నై 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 111 రన్స్‌‌ చేసి గెలిచింది. డుప్లెసిస్‌ (45 బంతుల్లో 3 ఫోర్లతో 43 నాటౌట్‌ ) రాణించాడు. దీపక్‌ చహర్‌ కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

ఈజీగానే..
లక్ష్యఛేదనలో చెన్నై సూపర్‌ కింగ్స్‌‌ ఎలాంటి తొందరపాటుకు వెళ్లలేదు. ఫస్ట్‌‌ ఓవర్‌ లోనే ఫోర్‌, సిక్స్‌‌ కొట్టినవాట్సన్‌ (9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌ తో 17) నరైన్‌ బౌలింగ్‌ లో ఔటయ్యాడు. ఆ తర్వాత ఓ సిక్స్‌‌, ఫోర్‌ తోటచ్‌ లో కనిపించిన రైనా (14) కూడా అతడికే వికెట్‌ సమర్పించుకున్నాడు. డుప్లెసిస్‌, రాయుడు (21) నెమ్మదిగా ఆడుతూ టార్గెట్‌ ను కరిగించుకుంటూవెళ్లారు. విజయానికి 32 బంతుల్లో 28 రన్స్‌‌ అవసరమైన దశలో రాయుడు ఔటైనా జాదవ్‌ (8 నాటౌట్‌ )తో కలిసి డుప్లెసిస్‌ పని పూర్తి చేశాడు. కోల్‌ కతా బౌలర్లలోనరైన్‌ 2, చావ్లా ఓ వికెట్‌ పడగొట్టారు.

సైకిల్‌ స్టాండ్‌ లా..
అంతకు ముందు టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ దిగిన కోల్‌ కతాకు ఆరంభంలోనే షాక్‌ ల మీద షాక్‌ లు తగిలాయి. మీడియం పేసర్‌ దీపక్‌ చహర్‌ ఓవర్‌ కోవికెట్‌ పడగొడుతూ రైడర్స్‌‌ బ్యాటింగ్‌ ను కోలుకోని దెబ్బతీశాడు. గత మ్యాచ్‌ లో తుఫాన్‌ ఇన్నింగ్స్‌‌తో రెచ్చి పోయిన ఓపెనర్లు క్రిస్‌ లిన్‌ (0), సునీల్‌ నరైన్‌(6) రెండు ఓవర్లు ముగియక ముందే పెవిలియన్‌ చేరారు. ఇన్నింగ్స్‌‌ తొలి ఓవర్‌ లో లిన్‌ను చహర్‌ వికెట్లముందు దొరక బుచ్చుకుంటే .. భజ్జీ బౌలింగ్‌ లో భారీషాట్‌కు యత్నించిన ఊతప్ప క్యాచ్‌ ఔటయ్యాడు. నిలకడకు మారుపే రైనా నితీశ్‌ రాణా(0) నిరాశపరిచాడు. చహర్‌ బౌలింగ్‌ లో పుల్‌ షాట్‌ కు యత్నించి రాయుడుకు చిక్కాడు. పవర్‌ ప్లేలోనే వీరబాదుడు బాది ప్రత్యర్థి పై పైచేయి సాధించే కోల్‌కతా తొలి మూడు ఓవర్లలో ఒక్క బౌండ్రీ కూడా కొట్టలేక పోయింది.

ఐదోఓవర్‌ లో రెండు ఫోర్లతో టచ్‌ లో కనిపించిన ఊతప్ప(11) మరో భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. దీంతో రైడర్స్‌‌ 24/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది.ఈ దశలో యంగ్‌ తరంగ్‌ శుభ్‌ మన్‌ గిల్‌ (9)తో కలిసి కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (21 బంతుల్లో 3 ఫోర్లతో 19)ఇన్నింగ్స్‌‌ను ముందుకు నడిపించేందుకు చూసినా అదీ ఎక్కువసేపు సాగలేదు. తాహిర్‌ వరుస ఓవర్లలో వీరిద్దరి పనిపట్టాడు. తొలుత కార్తీక్‌ కొట్టిన షాట్‌ ను మిడ్‌ వికెట్‌ లోనిల్చున్న భజ్జీ చక్కగా ఒడిసిపడితే.. ఆ మరుసటి ఓవర్‌ లో గిల్‌ ను ధోనీ స్టంపౌట్‌ చేశాడు. దీంతో కోల్‌ కతా 47/6 తోనిలిచింది. ఈదశలో రసెల్‌ కు చావ్లా(8) కాస్త సహకారం ఇవ్వడంతో ఇక కుదురు కున్నట్లే అనిపించినా.. భజ్జీ మాయలో చావ్లా బోల్తా పడ్డాడు. మరుసటి బంతికే కుల్దీప్‌‌(0) రనౌట్‌ కాగా.. ప్రసిధ్ (0) ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఓవైపు రసెల్‌ నాన్‌ స్ట్రయికింగ్‌ ఎండ్‌ లో ఉంటే.. ఇటు వైపు వికెట్లు పడుతూ పోయాయి. దీంతో చేసేదేమిలేక భారీ షాట్‌ లపైనే దృష్టి పెట్టిన రసెల్‌ చివరకు టీమ్‌ స్కోర్‌ 100 దాటించాడు. కుగ్లీన్‌వేసిన చివరి ఓవర్‌ లో ఒక సిక్స్‌‌, 2 ఫోర్లతో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు.

స్కోర్‌‌బోర్డ్‌
కోల్‌ కతా: లిన్‌ (ఎల్బీ) చహర్‌ 0, నరైన్‌ (సి) చహర్‌ (బి) హర్భజన్‌ 6, ఊతప్ప (సి) జాదవ్‌ (బి) చహర్‌ 11, రాణా (సి) రాయుడు (బి) చహర్‌ 0, కార్తీక్‌ (సి) హర్భజన్‌ (బి) తాహిర్‌ 19, గిల్‌ (స్టంప్డ్‌ ) ధోనీ (బి) తాహిర్‌ 9, రసెల్‌ (నాటౌట్‌ ) 50, చావ్లా (స్టంప్డ్‌ ) ధోనీ (బి) హర్భజన్‌ 8, కుల్దీప్‌‌ (రనౌట్‌ ) 0, ప్రసిధ్‌ కృష్ణ (సి) హర్భజన్‌ (బి) జడేజా 0, గర్నీ (నాటౌట్‌ )1;

ఎక్స్‌ ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 108/9; వికెట్ల పతనం: 1–6, 2–8, 3–9, 4–24, 5–44, 6–47, 7–76, 8–76, 9–79;
బౌలింగ్‌ : చహర్‌ 4–0–20–3, హర్భజన్‌ 4–0–15–2, జడేజా 4–0–17–1, కుగ్లీన్‌4–0–34– 0, తాహిర్‌ 4–0–21–2.

చెన్నై: వాట్సన్‌ (సి) చావ్లా (బి) నరైన్‌ 17, డుప్లెసిస్‌ (నాటౌట్‌ ) 43, రైనా (సి) చావ్లా (బి) నరైన్‌ 14, రాయుడు (సి) రాణా (బి) చావ్లా 21, జాదవ్‌ (నాటౌట్‌ ) 8; ఎక్స్‌ ట్రాలు:8; మొత్తం: 17.2 ఓవర్లలో 111/3; వికెట్ల పతనం: 1–18, 2–35, 3–81; బౌలింగ్‌ : చావ్లా 4–0–28–1, ప్రసిధ్‌ కృష్ణ 4–0–23–0, నరైన్‌ 3.2–0–24–2, కుల్దీప్‌‌ 4–0–16–0, గర్నీ 2–0–20–0.