V6 News

చెన్నై సూపర్‌‌‌‌‌‌‌‌కింగ్స్‌‌‌‌‌‌‌‌ జట్టులో కీలక మార్పు

చెన్నై సూపర్‌‌‌‌‌‌‌‌కింగ్స్‌‌‌‌‌‌‌‌ జట్టులో కీలక మార్పు

చెన్నై: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ ఫ్రాంచైజీ చెన్నై సూపర్‌‌‌‌‌‌‌‌కింగ్స్‌‌‌‌‌‌‌‌ జట్టులో ఒక్క మార్పు చోటు చేసుకుంది. గాయపడిన ఆయుష్‌‌‌‌‌‌‌‌ మాత్రే స్థానంలో పేసర్‌‌‌‌‌‌‌‌ ఆకాశ్‌‌‌‌‌‌‌‌ మధ్వాల్‌‌‌‌‌‌‌‌ను జట్టులోకి తీసుకుంది. రూ. 30 లక్షల బేస్‌‌‌‌‌‌‌‌ప్రైస్‌‌‌‌‌‌‌‌కే మధ్వాల్‌‌‌‌‌‌‌‌ను తీసుకున్నట్లు ఫ్రాంచైజీ గురువారం వెల్లడించింది. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో ఆరు మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడిన ఆయుష్‌‌‌‌‌‌‌‌.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌తో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో కండరాల గాయం బారిన పడ్డాడు. అతను కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయంగా మధ్వాల్‌‌‌‌‌‌‌‌ను తీసుకున్నారు. ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌కు చెందిన మధ్వాల్‌‌‌‌‌‌‌‌ గతంలో ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ (2023, 2024), రాజస్తాన్ రాయల్స్‌‌‌‌‌‌‌‌ (2025)కు ఆడాడు. మెగా లీగ్‌‌‌‌‌‌‌‌లో 17 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడిన మధ్వాల్‌‌‌‌‌‌‌‌ 23 వికెట్లు తీశాడు.