ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలి: మహబూబాబాద్ కలెక్టర్

ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలి: మహబూబాబాద్ కలెక్టర్

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో వర్షపాతం లోటు ఉన్నందున్న రైతులంతా ఆరుతడి పంటలను సాగు చేయాలని మహబూబాబాద్​కలెక్టర్ స్నేహ శబరీశ్ ​సూచించారు. శనివారం మరిపెడ మండలం ఎడ్జెర్ల గ్రామానికి చెందిన గిరిజన రైతు బాదావత్ వీరన్న-బుజ్జి దంపతుల పొలంలో కలెక్టర్​ పెసర విత్తనాలు వేసి పంట మార్పిడి విధానాన్ని ప్రారంభించారు. పప్పు దినుసులు, నూనె గింజలు, కుసుమ, ఆయిల్ పామ్, నువ్వులు, కూరగాయల సాగుపై దృష్టి సారించాలన్నారు.

వీబీజీ రామ్​ జీ పథకంలో యానిమల్ హెల్త్ క్లినిక్స్ సౌకర్యాన్ని ఉపయోగించి, కుక్కలతో పాటు, కోతులకు 'స్టెరిలైజేషన్' చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మరిపెడ మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర, జిల్లా హర్టికల్చర్​ ఆఫీసర్​ జినుగు మరియన్న, మున్సిపల్ కమిషనర్ నరేశ్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.