ప్రస్తుత టెస్ట్ టీమే ది బెస్ట్

ప్రస్తుత టెస్ట్ టీమే ది బెస్ట్

న్యూఢిల్లీ: గత జట్లతో పోలిస్తే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియానే.. అత్యుత్తమ టెస్ట్ టీమ్ అని లెజెండరీ బ్యాట్స్ మన్ సునీల్ గావస్కర్ అన్నాడు. విరాట్ సారథ్యంలో టీమిండియా ఐసీసీ టెస్ట్ ర్యాంకిగ్స్ లో   నంబర్ వన్ తో  పాటు.. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ లోనూ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నది. ‘బ్యాలెన్స్, స్కిల్స్, టెంపరమెంట్ పరంగా  ఇప్పుడున్న టీమ్ ది బెస్ట్. గతంలో ఉన్న జట్లకు ఈ టీమ్ కు అసలు పోలికే లేదు. కండీషన్స్, పిచ్లు ఎలా ఉన్నా విజయాలను అందించే బౌలర్లు అందుబాటులో ఉన్నారు. బ్యాటింగ్లో 1980 టీమ్ తో  సిమిలర్గా ఉంది. కానీ ఇప్పటిలా బౌలర్లు అప్పుడు లేరు. 20 వికెట్లు తీసి మ్యాచ్ను గెలిపించే సత్తా ఇప్పటి బౌలర్లకు ఉంది’ అని గావస్కర్ అన్నారు.