న్యూ హ్యాంప్‌షైర్: హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు సర్వ్ చేసే వారికి టిప్స్ ఇవ్వడం మామూలే. సర్వీస్ నచ్చి కొందరు కస్టమర్లు ఎక్కువ మొత్తంలో టిప్స్ ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడో కస్టమర్ మాత్రం ఏకంగా 16 వేల డాలర్ల (భారత కరెన్సీలో సుమారుగా రూ.11,86,867)ను టిప్‌గా ఇచ్చి అందర్నీ షాక్‌కు గురి చేశాడు. బార్‌లో కస్టమర్‌కు అయిన బిల్లు రూ.2,818 కాగా.. అతడు మాత్రం పదకొండు లక్షల టిప్ ఇవ్వడం విశేషం. ఈ ఘటన అమెరికా, న్యూ హ్యాంప్‌షైర్ సిటీ, లండన్‌డెర్రీలోని స్టంబుల్ ఇన్ బార్ అండ్ గ్రిల్‌లో జరిగింది. బార్‌కు వచ్చిన ఓ కస్టమర్ కొన్ని బీర్లు తాగాక వెళ్లే టైమ్‌లో భారీ టిప్ ఇచ్చి తమను ఆశ్చర్యపరిచాడని స్టంబుల్ ఇన్ యజమాని మైక్ జరెల్లా తెలిపారు.
‘రీసెంట్‌గా ఓ జెంటిల్మన్ మా బార్‌కు వచ్చాడు. బీర్‌తోపాటు కొన్ని చిల్లీ చీజ్ డాగ్స్‌ను ఆర్డర్ చేశాడు. ఆ తర్వాత పిక్‌ల్ చిప్స్‌తోపాటు టకీలా డ్రింక్‌ను కొనుగోలు చేశాడు. అక్కడి నుంచి వెళ్లిపోయే సమయానికి బార్ టెండర్‌ను పిలిచి బిల్ ఇవ్వాలని అడిగాడు. బిల్ టెండర్ వచ్చి బిల్ ఇచ్చి వెళ్లిపోతుండగా.. అతడు ఆమెను ఆపి ఒకే దగ్గర ఈ మొత్తం డబ్బును ఖర్చు చేయొద్దంటూ చెప్పాడు. అయితే పనిలో బిజీగా ఉన్న బార్ టెండర్.. అతడు ఎన్ని డబ్బులు ఇచ్చాడనే విషయాన్ని గమనించలేదు. అనంతరం టిప్ డబ్బులను చూసుకొని ఆమె నివ్వెరపోయింది. టిప్ ఇచ్చిన కస్టమర్‌ను దీని గురించి మేం ఆరా తీశాం. కానీ అతడు తాను కావాలనే ఆ డబ్బును ఇచ్చానని చెప్పాడు’ అని బార్ ఓనర్ జరెల్లా పేర్కొన్నారు. సదరు కస్టమర్ ఇచ్చిన 11 లక్షల డబ్బులను బార్‌లో పని చేస్తున్న ఎనిమిది మంది బార్ టెండర్‌లతోపాటు కిచెన్ వర్కర్‌లకు సమానంగా పంచి ఇచ్చానన్నారు.
Stumble inn had a very generous customer.we thank you for your generosity .
Posted by Michael Zarella on Monday, June 21, 2021
