చిన్నప్పట్నుంచీ క్రికెట్ అంటే ఇష్టం

చిన్నప్పట్నుంచీ క్రికెట్ అంటే ఇష్టం

హైదరాబాద్లో పుట్టి పెరిగిన తాను... క్రికెటర్ కావాలనుకున్నానని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. చిన్నప్పట్నుంచీ క్రికెట్ అంటే ఇష్టమని.. క్రికెటర్ అవ్యాలనుకునేవాడినని.. కానీ ఆర్థిక కారణాల వల్ల కాలేకపోయాయనని చెప్పారు. సివిల్స్ రాసి మొదటి ప్రయత్నంలోనే ఐపిఎస్ అధికారిగా సెలక్ట్ అయ్యానని... ఐన్నప్పటికి క్రికెట్ అంటే ఇంకా ప్రేమ తగ్గలేదన్నారు. సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ ఆధ్వర్యంలో... హుస్సేన్ సాగర్ లో జరిగిన 36వ ఎడిషన్ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ ముగింపు కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా... గెలుపొందిన క్రీడాకారులకు క్లబ్  ప్రతినిధులతో కలిసి సిపి విజేతలకు బహుమతులు అందజేశారు. జాతీయ స్థాయిలో ఈ సెయిలింగ్ పోటీలు జరగడం ఎంతో సంతోషంగా ఉందని... ఇందులో గెలుపొందిన క్రీడాకారులు భారత జట్టులో పాల్గొన్ని ఒలపింక్ లో ఆడటం గర్వకారణమన్నారు. క్రీడాకారులు పోటీతత్వం అలవర్చుకొని ఇంకా ఉన్నతస్థాయికి ఎదిగి... అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.