ఉద్యోగులు ఈ నెల 28-–30 తేదీల్లో తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఆదివారం యథావిధిగా పనిచేస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.
ఈ నెల 26 (శనివారం), సెప్టెంబర్ 27 (ఆదివారం) సెలవులు వస్తున్నాయి. సమ్మె జరిగితే బ్యాంకు సేవలు వరుసగా ఐదు రోజుల పాటు ఉండవు. కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
