వనపర్తి, వెలుగు : ఇంటర్ ఫలితాలలో తమ సీవీరామన్ జూనియర్ కాలేజీ విద్యార్థులు ఫస్ట్, సెకండ్ ఇయర్లో తమ విజయ పరంపర కొనసాగించారని కాలేజీ కరస్పాండెంట్ వీరయ్య తెలిపారు. సెకండ్ ఎంపీసీలో వి.మేఘన 993 మార్కులు, కె.అక్షయ, హన్సిక, సానియా, ఎం.స్వాతి 992, ఇ.శ్రావణి 991 మార్కులు సాధించారు. బైపీసీలో సి.లక్ష్మినారాయణ 991, పి.సూర్యవర్షిణి 986, మధుమోహన్రెడ్డి, కావ్య 979 మార్కులు, ఎంఈసీలో వి.నందిని 983, సీఈసీలో ఆర్.వైష్ణవి 884 మార్కులు సాధించారు.
జూనియర్ ఎంపీసీలో కె.నవ్యసుధ, ఎ.కావ్య468, మనస్విని, జయసూర్య, నరసింహ, సుమన్ 467, శ్రవాణి 466, అక్షయ 465 మార్కులు, బీపీసీలో మురళికృష్ణ 433మార్కులు, అభిలాష్ 427, హారిక 423, ఎంఈసీలో రాకేశ్నాయుడు 489, సీఈసీలో కె.శివకుమార్ 479, కె.అనిల్ 475 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్బంగా డైరెక్టర్స్ వెంకటేశ్వర్లు, కుమారస్వామి విద్యార్థులను అభినందించారు.

