V6 News

ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్.. SRHలోకి ఎలా వచ్చారో తెలుసా..? అంతా వరుణ్ ఆరోన్ పుణ్యమే..!

ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్.. SRHలోకి ఎలా వచ్చారో తెలుసా..? అంతా వరుణ్ ఆరోన్ పుణ్యమే..!

ఈ IPL సీజన్లోనే ఓటమి ఎరుగని జట్టుగా పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్న RR జట్టుకు SRH టీం ఓటమి రుచి చూపించింది. రాజస్తాన్ రాయల్స్ ఓడిపోయినా పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలోనే కొనసాగుతుండొచ్చు. కానీ.. ఓడిన తీరు మాత్రం రాజస్తాన్ అభిమానులను పీడ కలలా వెంటాడుతుందని చెప్పక తప్పదు. అందుకు.. కారణం.. ఇద్దరు SRH బౌలర్లు. ఆరంభ మ్యాచ్తోనే SRH పేసర్లు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ RR బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఐపీఎల్ మ్యాచ్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ ఓవర్లోనే మూడు వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌‌‌‌‌‌‌‌గా ప్రఫుల్‌‌‌‌ హింగే రికార్డుకెక్కాడు. మొత్తం నాలుగు వికెట్లు తీసి ఔరా అనిపించాడు.

సాకిబ్ హుస్సేన్ కూడా 4 వికెట్లు తీసి శభాష్ అనిపించాడు. ఈ ఇద్దరు బౌలర్లు వజ్రాలే కానీ ఈ వజ్రాలను వెలికితీసి సాన పట్టింది మాత్రం ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్. అసలు.. ఈ ఇద్దరి బౌలర్లను SRH వేలంలో చెరో రూ.30 లక్షలకు కొనడానికి కూడా కారణం ఇతనే. గత డిసెంబర్‌లో జరిగిన వేలంలో తన పట్టుదల వల్లే ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం ఈ ఇద్దరు బౌలర్లను రూ. 30 లక్షలకు తీసుకోవడానికి అంగీకరించిందని ఆరోన్ కూడా చెప్పారు. అంతేకాదు.. ప్రఫుల్ హింగే జర్నీలో ఆరోన్ కీలక పాత్ర పోషించాడు.

విదర్భకు చెందిన 24 ఏళ్ల హింగే.. 10 రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడి, ఐపీఎల్‌లో అరంగేట్రం చేయడానికి ముందు కేవలం ఒకే ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ సమయంలోనే ప్రఫుల్ హింగే కెరీర్ కోలుకోలేని మలుపు తిరిగింది. హింగే బౌలింగ్ కెరీర్‌కే ముప్పు తెచ్చే గాయం అయింది. అతని క్రికెట్ కెరీర్ ముగిసిపోయిందని కుటుంబం కూడా ఫిక్స్ అయిపోయింది. ఆ సమయంలోనే ప్రఫుల్ హింగేకు వరుణ్ ఆరోన్ అండగా నిలిచాడు. గాయం నుంచి కోలుకునే దిశగా హింగేలో ఆత్మ స్థైర్యాన్ని నింపాడు. అసలైన కెరీర్ ఇప్పటి నుంచే మొదలైందని.. ప్రఫుల్కు గురువులా మారి బౌలింగ్లో అన్ని రకాల టెక్నిక్స్ నేర్పించాడు. ఫలితమే SRH మ్యాచ్లో ప్రఫుల్ హింగే అద్భుత ప్రదర్శన.

సాకిబ్ హుస్సేన్ బౌలింగ్ కెరీర్ కూడా వరుణ్ ఆరోన్ వల్లే అనుకోని మలుపు తిరిగింది. SRH టీంలోకి ఫాస్ట్ బౌలర్ల కోసం వరుణ్ ఆరోన్ అన్వేషిస్తున్న క్రమంలో.. MRF అకాడమీలో సాకిబ్ను గుర్తించి.. అతని బౌలింగ్ ను వరుణ్ ఆరోన్ గమనించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉత్తర ప్రదేశ్‌పై వేసిన పదునైన స్పెల్‌తో షకీబ్ మళ్ళీ ఆరోన్ కంట్లో పడ్డాడు. 

సాకిబ్ను SRH జట్టులోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ దగ్గర మొండిగా పట్టుబట్టి మరీ సాకిబ్ ను బేస్ ప్రైస్ 30 లక్షలకు SRH జట్టులోకి తీసుకునేలా చేశాడు. సాకిబ్పై వరుణ్ ఆరోన్ పెట్టుకున్న నమ్మకం వృధాగా పోలేదు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 4 వికెట్లు తీసి సాకిబ్ హుస్సేన్ దుమ్ములేపాడు.

మరిన్ని వార్తలు