V6 News

పిల్లలు పాత సైకిల్ బోర్ అంటున్నారా..? ఇలా చేస్తే కలర్ ఫుల్ సైకిల్ రెడీ..!

పిల్లలు పాత సైకిల్ బోర్ అంటున్నారా..? ఇలా చేస్తే కలర్ ఫుల్ సైకిల్ రెడీ..!

పిల్లలు సైకిల్ రైడింగ్ అంటే చాలా ఇష్టపడతారు. అయితే సైక్లింగ్ ను  మరింత ఫన్ గా , ఇంట్రెస్టింగ్ గా మార్పొచ్చు. కాస్త క్రియేటివ్ గా ఆలోచిస్తే, బైక్/సైకిల్ ను  అందంగా డెకొరేట్ చేసుకోవచ్చు.

సైకిల్ ను  డెకొరేట్ చేయాలనగానే ఫస్ట్ గుర్తొచ్చేది టైర్... దీనికి ఉండే స్పోక్స్ (చక్రం  మధ్యలో ఉండే సన్నని స్టీల్ బార్స్)ను రకరకాలుగా అలంకరిస్తే బాగుంటుంది. మార్కెట్లో ట్విస్ట్ పైప్ క్లీనర్స్ దొరుకుతాయి. వాటిలో డిఫరెంట్ కలర్స్ సెలక్ట్ చేసుకుని, స్పోక్స్ కు  చుడితే అట్రాక్టివ్ గా ఉంటుంది. లేదా చిన్నచిన్న రిబ్బన్స్ ను  కూడా స్పోక్స్ కు చుట్టినా కలర్ ఫుల్ గా ఉంటుంది. 

డెకొరేటివ్ షాప్స్ లో  ప్రిమేడ్ మెటాలిక్ స్టార్స్ దొరుకుతాయి. లేదా కార్డ్ బోర్డుతో స్టార్స్ కట్ చేసుకోవాలి. ఈ స్టార్స్  వీల్ స్పోక్స్  కు అటాచ్ చేస్తే అందంగా ఉంటుంది.  కూల్‌ డ్రింక్స్ స్ట్రాలను నిలువుగా కట్ చేసి, వీల్ స్పోక్స్ కు  చుట్టి. వైట్ టేప్ తో అతికించినా బాగుంటుంది.

నెంబర్ ప్లేట్ 

కిడ్స్ బైక్ కు  నెంబర్ ప్లేట్ ఏంటనుకుంటున్నారా? పెద్దవాళ్ల బైక్స్, కార్స్ కు  ఉండే నెంబర్ ప్లేట్స్ తమ సైకిల్స్ కు  కూడా ఉంటే పిల్లలు థ్రిల్ ఫీలవుతారు. అందుకే పిల్లల సైకిల్స్ కు కూడా ఫన్నీగా ఉండే నెంబర్ ప్లేట్  యాడ్ చేయొచ్చు. 5" x 7" అంగుళాల సైజులో ఒక అట్టముక్కను, రెక్టాంగిల్ లో కట్ చేయాలి. దీనిపై వాటర్ కలర్స్ లేదా స్కెచెస్ వాడి పిల్లలకు నచ్చిన నెంబర్స్, వాళ్ల ముద్దు పేర్లు (పింకీ, చంటి వంటివి) రాయొచ్చు. 

నచ్చిన డిజైన్లో, మంచి బోర్డర్ ప్లేట్ కలర్ఫుల్ గా తయారు చేయాలి. ఈ కార్డ్ బోర్డు   సైకిల్ సీటు వెనుక కింది భాగంలో లేదా సైకిల్ వెనుక ఉండే డోమ్ పైన అతికించాలి. దీనికోసం అవసరమైతే చిన్న రంధ్రాలు చేసి నట్లతో బిగించాలి. లేదంటే చిన్న తాడుతో కట్టినా పర్లేదు.

బర్త్ డే స్పెషల్

చిన్నారుల బర్త్ డే వచ్చిందంటే రకరకాల ఫొటోలు తీస్తారు. ఇంట్లోనే తక్కువ ఖర్చుతో మంచి ఫొటోలు కావాలంటే దానికి సైకిల్ డెకొరేషన్ థీమ్ చాలా మంచిది. ఇది చాలా సింపుల్ కూడా. సైకిల్ టైర్స్, వీల్, హ్యాండిల్స్ తో   సహా డెకొరేట్ చేయొచ్చు. దీనికోసం గిఫ్ట్ షాపుల్లో దొరికే బెలూన్స్, కలర్ పేపర్స్, పామ్-పామ్స్, ఫ్లవర్స్ వంటివి వాడాలి. ఫంక్షన్స్ అప్పుడు వాడే స్పెషల్ ఫ్లవర్స్ తో  కూడా సైకిల్ ను  అలంకరించవచ్చు. సైకిల్ ను  ఇలా అందంగా డెకొరేట్ చేసి, ఇంట్లోనే మంచి ఫొటోలు తీయొచ్చు..