గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ఎస్క్వైర్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన కొత్త లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తూ మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఎస్క్వైర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా పెరెంటింగ్‌పై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
“రఫ్ డాడ్”గా చరణ్
ఈ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తనను తాను ఫన్ డాడ్ కూడా కాదని, స్ట్రిక్ట్ డాడ్ కూడా కాదని.. ఈ రెండింటి మధ్యలో ఉండే “రఫ్ డాడ్”గా పేర్కొన్నారు. పిల్లలు అల్లరి చేస్తూ ఆడుకుంటే వారిని ఆపకుండా ప్రోత్సహిస్తానని చెప్పారు. “వాళ్లను దూకనిస్తూ.. మట్టిలో ఆడనిస్తుంటాను. ఉపాసన పిల్లలని చాలా అపురూపంగా చూసుకుంటుంది. అయితే, వాళ్ల అమ్మ ఎప్పుడైనా తిట్టినప్పుడు క్లీంకారా నా దగ్గరకు వస్తుంది’’ అని రామ్‌చరణ్ సరదాగా చెప్పారు..
పిల్లలే ‘నా ప్రపంచం’
తన పిల్లల గురించి మాట్లాడినప్పుడు చరణ్ ఎమోషనల్ అయ్యరు. పిల్లలు ఇంట్లో లేకపోతే ఇల్లు ఖాళీగా అనిపిస్తుందని, వారినే తన “హార్ట్‌బీట్”గా భావిస్తానన్నారు. తండ్రిగా మారిన తర్వాత తన జీవితంలో పూర్తిగా మార్పు వచ్చిందని, షూటింగ్ లో ఎంత కష్టపడి వచ్చినా ఇంటికి వెళ్లిన వెంటనే పిల్లలతో గడపడం తనకు ముఖ్యమని తెలిపారు. అలాగే, తన పెంపుడు కుక్క ‘రైమ్’ కూడా తన ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని చెప్పారు.
పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర
పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల ప్రభావం ఎంతో ముఖ్యమని చరణ్ వివరించారు. పిల్లలు మాటలు వినడం కంటే, తల్లిదండ్రులను గమనిస్తూ ఎక్కువగా నేర్చుకుంటారని అన్నారు. అందుకే తాను ఒక “ప్రెజెంట్ పర్సన్”గా, ముఖ్యంగా “ప్రెజెంట్ ఫాదర్”గా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.
ఇకపోతే, రామ్ చరణ్-ఉపాసన దంపతులు 2012లో వివాహం చేసుకున్నారు. 2023లో వారికి కుమార్తె క్లీంకార జన్మించింది. 2026 జనవరిలో కవల పిల్లలు పుట్టగా, వారికి శివ రామ్ కొణిదేల, అన్వీరా దేవి కొణిదేల అనే పేర్లు పెట్టారు.
Mega in stature, effortless in spirit. At the peak of his career and at the centre of a life well built, our April cover star, @alwaysramcharan embodies what winning on every front really looks like. This is truly a man in his prime.
— Esquire India (@esquire_india) April 14, 2026
Read the full story: https://t.co/wxleQlPgZl pic.twitter.com/HSNkCBcqj6
‘పెద్ది’ కోసం కఠిన శిక్షణ
ప్రస్తుతం రామ్ చరణ్ తన తదుపరి చిత్రం “పెద్ది” కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్లుగా కష్టపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఈ పాత్ర కోసం ఏడాదిన్నర పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నట్లు చెప్పారు. ఫిట్‌గా కనిపించేందుకు ప్రత్యేకంగా ట్రైనింగ్‌పై దృష్టి పెట్టడంతో పాటు, సుల్తాన్, దంగల్ వంటి చిత్రాలకు పనిచేసిన కోచ్ వద్ద కుస్తీ శిక్షణ కూడా తీసుకున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 30, 2026న పెద్ది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

