మహబూబ్ నగర్ టౌన్ , వెలుగు : ఇంటర్ ఎగ్జామ్ ఫలితాల్లో నగరంలోని రిషి జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. ఎంపీసీలో వినయ్ కుమార్ గౌడ్ 468 మార్కులు , వేణుమాధవ్ రెడ్డి, జి.అంకిత్, జి. మాధురి, ఎ. కార్తీక్ రెడ్డి, సృజన విద్యార్థులు 467 మార్కులతో ప్రతిభ చాటారు. బైపీసీలో అక్షిత, తానియా మహమూద్ 438 మార్కులు సాధించగా.. శ్రావణి, భవిత, సౌమ్య, సురేంద్ర చక్రవర్తి, అక్షిత, ఆయేషా జువా, అఖిల ,అశ్లేష యాదవ్, మౌనిక, రిషిత, నాగ సాయి వైష్ణవి, మైవిన్, కె. మీనాక్షి సహా 14 మంది విద్యార్థులు 437 టాప్ మార్కులు సాధించారు.
సెకెండ్ ఇయర్ ఎంపీసీలో ఎం. భావన కు 995 రాగా.. మొహమ్మద్ అశ్వాక్ అహ్మద్, సయ్యద్ మిస్బావుద్దిన్, శ్రీవిద్య 992 , కోటేశ్వర్ 990 మార్కులు సాధించారు. బైపీసీలో అఫ్సా మోయిన్, పి. గాయత్రి 994, ఫారియా, ఫాతిమా కదీర్ 993 మార్కులు సాధించగా, నందిని రెడ్డి, వైశాలి 992 మార్కులు, శ్రీనిధి 991, సృజన 990, సుమేరా బేగం 990 మార్కులు తెచ్చుకున్నారు. వీరిని కాలేజీ డైరెక్టర్ వెంకటయ్య , చైర్‌పర్సన్ చంద్రకళ వెంకట్, డీన్ భూపాల్ రెడ్డి, అకాడమిక్ డీన్ కళ్యాణ్ బాబు, ప్రిన్సిపాల్స్ రాఘవేంద్రరావు, వెంకటరత్నం, ప్రసన్నకుమారి, ఉత్తమ ఫలితాలు సాధించిన స్టూడెంట్స్ ను అభినందించారు

