V6 News

Weekend OTT: ఉస్తాద్ భగత్ సింగ్, యూత్తో పాటుగా.. OTTలో ఈ వారం మస్ట్ వాచ్ మూవీస్

Weekend OTT: ఉస్తాద్ భగత్ సింగ్, యూత్తో పాటుగా.. OTTలో ఈ వారం మస్ట్ వాచ్ మూవీస్

ఈ వారం (ఏప్రిల్ 13 నుంచి 19 వరకు) OTT లైనప్ ఎంతో బలంగా కనిపిస్తోంది. తెలుగు సినిమాలతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల నుంచి ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. రొమాంటిక్ యాక్షన్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ డ్రామాల వరకు విభిన్న జానర్లలోని కంటెంట్ అందుబాటులోకి వస్తుండటం విశేషంగా మారింది.

తెలుగులో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, మలయాళంలో ‘యూత్’, హిందీలో ‘మట్కా కింగ్’, ‘అస్సీ’, ‘టోస్టర్’, ఇంగ్లిష్‌లో ‘యూఫోరియా’ సీజన్ 3 వంటి సినిమాలు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయనున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల కానున్నాయి. మొత్తంగా చూస్తే, ఈ వారం ఓటీటీలో అన్నీవర్గాల ప్రేక్షకులకు నచ్చేలా డిఫెరెంట్ కంటెంట్ అందుబాటులోకి రానుంది. మరి ఆ సినిమాలు, సిరీస్‌లు ఏవో ఇప్పుడు చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్‌

టోస్టర్ ( హిందీ డార్క్ కామెడీ మూవీ) - ఏప్రిల్ 15

మిలియన్ డాలర్ సీక్రెట్ సీజన్ 2 (రియాలిటీ షో) - ఏప్రిల్ 15

ఫేక్ ప్రొఫైల్ సీజన్ 3 ( ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - ఏప్రిల్ 15

బీఫ్ సీజన్ 2 (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 16

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌- (తెలుగు యాక్షన్ డ్రామా)- ఏప్రిల్‌ 16

యూత్‌ - (తెలుగు డబ్బింగ్ మూవీ)-  ఏప్రిల్‌ 16

180 (సౌత్ ఆఫ్రికన్ ఇంగ్లీష్ థ్రిల్లర్ మూవీ) - ఏప్రిల్ 17

ఏ గోరిల్లా స్టోరీ (డాక్యుమెంటరీ) - ఏప్రిల్ 17

ఆల్ఫా మేల్స్ సీజన్ 5 (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 17

రూమ్ మేట్స్ (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 17

ప్రైమ్ వీడియో

బాల్స్ అప్ (యాక్షన్ కామెడీ ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 15

మట్కా కింగ్ (తెలుగు డబ్ / హిందీ సిరీస్)- ఏప్రిల్ 17
- 1960ల బాంబే గ్యాంబ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే క్రైమ్ డ్రామా

అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ రొమాన్స్ ( సిరీస్) - ఏప్రిల్ 17

అమెరికన్ గ్లాడియేటర్స్ ( రియాలిటీ షో)– ఏప్రిల్ 17

జీ5

తాప్సీ 'అస్సీ'- (కోర్టు రూమ్ డ్రామా)- ఏప్రిల్ 17

జియో హాట్‌స్టార్‌

యుఫొరియా సీజన్ 3 (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 15న

సంభవం అధ్యాయం ఒన్ను - (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఏప్రిల్ 15

ఈటీవీ విన్‌

మా ఇంటి కథ- ఏప్రిల్‌ 17

ఇవే ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఈ వారం OTT సినిమాలు, వెబ్‌సిరీస్‌లు. ఈ లిస్టును పరిశీలిస్తే, ఈ వారం ప్రేక్షకులను అలరించే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే, కొన్ని సందర్భాల్లో OTT సంస్థలు ముందస్తు ప్రకటనలు లేకుండానే కొత్త సినిమాలు లేదా సిరీస్‌లను కూడా విడుదల చేస్తుంటాయి. అందువల్ల, ఈ లిస్టులోకి మరికొన్ని సినిమాలు కూడా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.