
- పాల్గొననున్న సీఎం,డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) మీటింగ్ బిహార్ రాజధాని పాట్నాలో బుధవారం జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో రాష్ట్ర మంత్రులు దామోదర రాజ నర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి రాత్రి పాట్నా చేరుకున్నారు. వీరితో పాటు ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి కూడా ఈ మీటింగ్‌కు అటెండ్ కానున్నారు.