ఎయిర్ ఫోర్స్ అకాడమీ అధికారిగా నమ్మించి 2.26 లక్షలు టోకరా

ఎయిర్ ఫోర్స్ అకాడమీ అధికారిగా నమ్మించి 2.26 లక్షలు టోకరా

బషీర్​బాగ్, వెలుగు: ఎయిర్ ఫోర్స్ అకాడమీ అధికారి అంటూ నమ్మించి ఓ ప్రముఖ కంపెనీ ఎండీని సైబర్ చీటర్స్ మోసగించారు. నగరానికి చెందిన ఓ వ్యక్తి కంపోస్టేబుల్​ మల్చ్​ షీట్స్​ సప్లై చేస్తుంటాడు. ఆయనకు గత నెల 18న దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచి అధికారి అంటూ కునాల్ పేరిట స్కామర్స్ ఫోన్ చేశారు. తమ అకాడమీకి ఒక టన్ను మల్చ్ షీట్స్ సప్లై చేయాలని కోరారు. 

నకిలీ పర్చేస్​ ఆర్డర్ , జీఎస్టీ పేపర్లను చూపించారు. కొన్ని రోజుల తరువాత కాల్ చేసిన స్కామర్స్ డిఫెన్స్ రూల్స్ మేరకు తమ అకౌంట్ కు కొంత డబ్బులు బదిలీ చేయాలని, వాటిని వెంటనే తిరిగి చెల్లిస్తామని చెప్పారు. నమ్మిన బాధితుడు మొత్తం రూ.2,26,549 స్కామర్స్ అకౌంట్ కు బదిలీ చేశాడు. ఆ డబ్బులు తిరిగి చెల్లించపోగా, మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో స్కామ్ అని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైంకు ఫిర్యాదు చేశారు.