క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని మోసం

క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని మోసం

బషీర్​బాగ్, వెలుగు: క్రెడిట్ కార్డు లిమిట్ ను పెంచుతామని నమ్మించి ఓ మహిళను సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం... అమీర్ పేటకు చెందిన 50 ఏళ్ల మహిళకు స్కామర్స్ ఆర్బీఎల్ క్రెడిట్ కార్డు ప్రతినిధి అంటూ ఫోన్ చేశారు. క్రెడిట్ కార్డు లిమిట్ ను రూ.5 లక్షలకు పెంచుతామని నమ్మించారు. ఏపీకే ఫైల్ ను పంపించారు. ఆమె క్లిక్​ చేసి కార్డు వివరాలు నమోదు చేయగా, కాసేపటికే రెండు కార్డుల్లో రూ.లక్షా 28 వేల 273 డెబిట్​ అయ్యాయి.

ఏపీకే ఫైల్​ పంపించి..

అసిఫ్ నగర్ ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల వ్యక్తి సూపర్ మనీ యాప్ ద్వారా మరొకరికి డబ్బులు పంపాడు. అవి ట్రాన్స్​ఫర్​ కాకపోవడంతో గూగుల్ లో కస్టమర్​ కేర్​ నంబర్​ చూసి ఫోన్​ చేశాడు. లైన్ లోకి స్కామర్స్​ వచ్చి ఏపీకే ఫైల్ ను పంపించారు. బాధితుడు అందులో క్రిడిట్​ కార్డు వివరాలు నమోదు చేయగా రూ.లక్షా 43 వేలు డెబిట్ అయ్యాయి.