నమ్మించిన్రు.. రూ.కోటికి పైగా స్వాహా చేసిన్రు

నమ్మించిన్రు.. రూ.కోటికి పైగా స్వాహా చేసిన్రు

సిటీలో సైబర్​నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సైబర్​ నేరగాళ్ల బారిన పడి హైదరాబాద్​కు చెందిన ఇద్దరు వ్యక్తులు రూ.1.40 కోట్లు నష్టపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలికి చెందిన ఓ వ్యక్తి సికింద్రాబాద్​రైల్వే శాఖలో పని చేస్తున్నారు. ఈ మధ్య అతని వాట్సప్​నకు గోల్డ్​ ట్రేడింగ్​ చేయండి.. కోటీశ్వరులవ్వండి అనే మెసేజ్​ వచ్చింది.

అందులోని నంబర్​కు తాను ట్రేడింగ్​కు సిద్ధంగా ఉన్నానని బదులివ్వడంతో ఓ లింకును పంపించారు. అది క్లిక్​ చేసి యాప్​ డౌన్​లోడ్​ చేసుకోవాలని సూచించారు. వారు చెప్పినట్లే ఈయనా చేశాడు. మొదట కొంత డబ్బు పెట్టగా లాభాలు ఇచ్చారు. తరువాత దాన్ని మరింతగా నమ్మి రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టాడు. లాభం వచ్చినట్లు చూపించినా అమౌంట్​ విత్​డ్రా చేసుకునే ఛాన్స్​ ఇవ్వలేదు. మరింత డబ్బు పెడితే క్యాష్​ ట్రాన్స్​ఫర్​ అవుతుందని చెప్పడంతో విడతల వారీగా రూ.70 లక్షలు సమర్పించాడు. 

ఎల్లారెడ్డిగూడలో..

ఎల్లారెడ్డిగూడకు చెందిన మరో వ్యక్తికి పార్ట్​టైం ఉద్యోగం అని మెసేజ్​ పంపించారు. లింక్​ క్లిక్​చేయగానే సైబర్​ నేరగాళ్ల టెలిగ్రాం గ్రూప్​తో బాధితుడి నంబర్​ లింక్​ అయింది. బాధితుడి నమ్మకాన్ని గెలుచుకుని రూ.150 పెట్టుబడి నుంచి రూ.70 లక్షలు పెట్టుబడి పెట్టించి మొత్తం డబ్బులు కాజేశారు. ఇరువురు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.