సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వర్ రావు అరెస్ట్

సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వర్ రావు అరెస్ట్

సీసీఎస్ ACP ఉమా మహేశ్వరరావును అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇవాళ ఉదయం నుంచి అశోక్ నగర్ లోని ఆయన ఇంటితో పాటు 14 చోట్ల సోదాలు నిర్వహించి.. 17 ప్రాపర్టీలను గుర్తించారు. ఘట్ కేసర్ లో 5 ప్లాట్లు, 38 లక్షల నగదు, 60 తులాల బంగారం సీజ్ చేశారు.  ప్రభుత్వ  విలువ 3 కోట్లకు పైనే ఉంటుందన్నారు ఏసీబీ అధికారులు. బయటి మార్కెట్ ప్రకారం దాదాపు రూ.40 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.  రెండు లాకర్లు గుర్తించారు. శామీర్ పేట్ లో ఒక విల్లా ఉన్నట్లు నిర్దారించారు. 

బినామీ పేర్లతో భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఉమామహేశ్వరరావు, సందీప్ కలిసి పెట్టుబడులు పెట్టినట్లు అనుమానిస్తున్నారు ఏసీబీ అధికారులు.  ఈ సందీప్ ఎవరనేదానిపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  CCSలో ఉమామహేశ్వరరావు డీల్ చేసిన కేసుల వివరాలపై ఆరా తీశారు. సాహితీ ఇన్ఫ్రా కేసులో బాధితుల దగ్గర నుంచి ఉమామహేశ్వరరావు డబ్బులు డిమాండ్ చేసినట్లు అనుమానిస్తున్నారు ఏసీబీ అధికారులు. అయితే ఉమామహేశ్వర రావు విచారణకు  సహకరించడం లేదని వెల్లడించారు. మే  22న ఉమా మహేశ్వరరావును కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర బాబు.