సైబర్ మోసం.. పులిచర్మం పేరుతో రూ. 20 లక్షల స్వాహా

సైబర్ మోసం.. పులిచర్మం పేరుతో  రూ. 20 లక్షల స్వాహా


సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తాజాగా ఆన్ లైన్ కొరియర్ డెలివరీ పేరుతో రూ. 20 లక్షలు కొట్టేశారు. ఫెడెక్స్ కొరియర్లో పులిచర్మం పేరుతో టోలిచౌకి ప్రాంతానికి చెందిన వృద్ధుడి నుంచి రూ. 20 లక్షలు బదిలీ చేసుకున్నారు. 

టోలిచౌకిలో నివాసముండే వృద్దుడికి ఫెడెక్స్ కొరియర్ పేరుతో కాల్ చేశారు సైబర్ నేరగాళ్లు.  పులి చర్మం ఫెడెక్స్ కొరియర్ ద్వారా డెలివరీ చేయాలంటే ఖర్చు అవుతుందని వృద్ధుని ట్రాప్లో దించారు.  ఆ తర్వాత ఫెడెక్స్ కొరియర్ ను వృద్ధుడికి మరో ఫేక్ కాల్ చేశారు. సీబీఐ వాళ్లు మనీలాండరింగ్ కేసు నమోదు చేశారని..కేసు మాఫీ చేయాలంటే రూ. 20 లక్షలు బదిలీ చేయాలని బెదిరించారు. దీంతో హడలిపోయిన వృద్ధుడు సైబర్ నేరగాళ్ల అకౌంట్ కు రూ. 20 లక్షలు ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ చేశాడు. చివరకు మోసపోయానని గ్రహించి..సైబర్ క్రైం స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు చేస్తున్నారు.