- నకిలీ యాప్స్‌తో ఫోన్‌ను కంట్రోల్లోకి తీసుకుంటున్న నేరగాళ్లు..
- అనుమానం రాకుండా ఓటీపీలతోనూ ఫ్రాడ్
- ఆలోచించకుండా నొక్కితే అంతే సంగతి
కూకట్ పల్లికి చెందిన రిటైర్డ్ టీచర్ సోమేశ్ షాపింగ్‌మాల్‌లో బట్టలు కొన్నాడు. రెండు రోజుల తర్వాత అతడికి ఒక ఏపీకే ఫైల్వచ్చింది. బట్టలు కొన్నందుకు గిఫ్ట్ ఓచర్ వచ్చిందని, దాన్ని రిడీమ్ చేసుకోవాలంటే తాము పంపిన ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్‌చేసుకోవాలని సూచించారు. దీంతో వారు చెప్పినట్టు చేశాడు. కొద్దిసేపటికే అతడికి ఓ ఓటీపీ వచ్చింది.
తర్వాత కొద్దిసేపటికి ఫోన్స్ట్రక్ అయినట్టు అనిపించింది. కాసేపటికి అంతా సెట్అయిపోయింది. కానీ, అతడి బ్యాంక్ అకౌంట్ నుంచి పలు ఖాతాలకు డబ్బులు క్రెడిట్ అయ్యాయని మెసేజ్‌లు వచ్చాయి. దీంతో సైబర్ క్రిమినల్స్ తనను మోసం చేశారని తెలుసుకుని బ్యాంకుతో పాటు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు.
హైదరాబాద్ సిటీ, వెలుగు : రాష్ట్రంలో సైబర్క్రిమినల్స్ఏపీకే ఫైల్స్ పంపి జనాల కష్టార్జితాన్ని కొల్లగొడుతున్నారు. ఏపీకే ఫైల్స్‌తో వాట్సాప్ హ్యాక్ చేసి దాని ద్వారా బ్యాంక్‌ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. గవర్నమెంట్పథకాలు, బ్యాంక్సర్వీస్, ఇన్వెస్టిమెంట్ఛాన్స్పేర్లతో మెసేజ్‌లు పంపిస్తూ ఆకర్శిస్తున్నారు. ఆ పేర్లతో వచ్చిన ఏపీకే ఫైల్స్‌ను డౌన్లోడ్ చేయించి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం సేకరించి డబ్బులు కాజేస్తున్నారు.
మోసం చేస్తారిలా..
బ్యాంక్ అప్డేట్స్ వచ్చాయని, ఉద్యోగాలున్నాయంటూ సైబర్క్రిమినల్స్ఫేక్లింకులను ఎస్ఎంఎస్, వాట్సాప్, సోషల్ మీడియా, ఈమెయిల్ ద్వారా పంపుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఆర్టీఓ చలాన్, పీఎం కిసాన్, ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్‌బోర్డు బిల్లులు, క్రెడిట్‌కార్డ్, రివార్డ్స్పాయింట్ల పేరుతో ఏపీకే ఫైల్స్పంపుతున్నారు. అవి ఇన్స్టాల్చేయగానే మన ఎస్ఎంఎస్, కాంటాక్ట్స్, నోటిఫికేషన్, స్ర్కీన్షేరింగ్వంటి యాక్సెస్ సైబర్‌నేరగాళ్ల చేతికి వెళ్తోంది. మన ఫోన్‌ను వారి ఆధీనంలోకి తీసుకుని బ్యాంక్ లాగిన్లు, ఓటీపీల సమాచారం సేకరిస్తున్నారు. కొన్ని యాప్స్‌తో మొబైల్‌ను పూర్తిగా వారి స్వాధీనంలోకి తీసుకుంటున్నారు.
ఇలా చేస్తే సమస్య ఉండదు.
తెలియని ఏపీకే ఫైల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో డౌన్లోడ్చేయవద్దు , ఎస్ఎంఎస్, వాట్సాప్, టెలిగ్రామ్, ఈమెయిల్లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చిన యాప్‌లను ఇన్స్టాల్చేయొద్దు. అధికారికంగా నిర్ధారించని లింకులను జాగ్రత్తగా పరిశీలించాలి. బ్యాంక్ అప్డేట్లు, క్యాష్‌బ్యాక్, కేవైసీ వెరిఫికేషన్, ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే లింకులు క్లిక్ చేయొద్దు. సైబర్క్రిమినల్స్ప్లే స్టోర్‌నుంచి కాకుండా బయటి నుంచే ఏపీకేలను డౌన్లోడ్చేయమని చెప్తారు.
ఇలా చెప్పినప్పుడు ఖచ్చితంగా అనుమానించాలి. అవసరం లేని పర్మిషన్లు ఇవ్వాలని చెప్పినప్పుడు అనుమానించాలి అంటే యాప్ ఇన్స్టాల్చేసేప్పుడు స్క్రీన్షేరింగ్వంటి అనుమతులు కోరినప్పుడు సందేహించాలి. మొబైల్, యాంటీవైరస్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. మాల్వేర్నుంచి రక్షణ పొందేందుకు ఎప్పటికప్పుడు మొబైల్ ఓఎస్, సెక్యూరిటీ టూల్స్అప్డేట్ చేయాలి.
ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీ లేదా బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పొద్దు. బ్యాంకులు లేదా ప్రభుత్వ సంస్థలు ఓటీపీలు, పాస్వర్డ్లు అడగవన్న సంగతి గుర్తుంచుకోవాలి. సైబర్క్రైమ్జరిగిందని తెలిసినప్పడు 1930 నంబర్‌కు కాల్చేసి చెప్పడమో లేదా cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలి.
ఓటీపీ మోసాలు ఇలా...
బ్యాంక్ పేరిట, కేవైసీ అప్డేట్ అంటూ కాల్స్ చేస్తారు. బ్యాంక్ ఉద్యోగులం అని చెప్పి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఖాతా బ్లాక్ అవుతుందని చెప్పి ఓటీపీ చెప్పాలని కోరతారు. ఇలా చెప్పడం వల్ల మన ఖాతాల్లోకి డబ్బులన్నీ ఖాళీ అవుతాయి. ఆన్లైన్షాపింగ్చేయడం వల్ల క్యాష్బ్యాక్వచ్చిందని, రీఫండ్, గిఫ్ట్ ఓచర్, లేదా పాయింట్లు వస్తాయని చెప్పి కాల్చేస్తారు.
ఈ సందర్భాల్లో కూడా ఓటీపీలు తీసుకుని డబ్బులు కొల్లగొడతారు. గూగుల్‌లో ఏదైనా కస్టమర్ కేర్ నంబర్ గురించి సెర్చ్చేసినప్పుడు కొందరు సైబర్క్రిమినల్స్తెలివిగా తాము పెట్టిన నంబర్స్ముందు వచ్చేలా చూస్తారు. ఈ నంబర్‌కు కాల్ చేసినప్పుడు మోసగాళ్లు కాల్స్మాట్లాడతారు.
వెరిఫికేషన్ కోసం ఓటీపీ అడిగి డబ్బులు కాజేస్తారు. గూగుల్లోగాని, సోషల్ మీడియాలో కనిపించే నంబర్లు కాకుండా అధికారిక వెబ్‌సైట్స్, యాప్స్‌లో ఉన్న నంబర్లను ఉపయోగించడం వల్ల సమస్య ఉండదు. తాము చెప్పినట్టు వింటే వెంటనే ఉద్యోగం లేదా లోన్ వస్తుందని ఓటీపీ అడుగుతారు.
ఇలాంటి వారిని ఎట్టిపరిస్థితుల్లో నమ్మొద్దు. వ్యక్తిగత వివరాలు, ఓటీపీ తెలుసుకుని మన పేరు మీదున్న సిమ్‌కు డూప్లికేట్తీసుకుంటారు. ఈ సిమ్‌ను బ్యాంకింగ్ అవసరాలకు వాడుకుని మన డబ్బులను మాయం చేస్తారు. లివరీ బాయ్, మార్కెట్ఏజెంట్లుగా నమ్మించి మనం కొన్న వస్తువు రిటర్న్/రిఫండ్ కోసం ఓటీపీ చెప్పాలని కోరతారు.
దీనివల్ల మన డబ్బులను పోగొట్టుకుంటాం. ఈ సమస్యలు రావొద్దనుకుంటే సాధ్యమైనంతవరకు మెసేజ్స్క్రీన్షాట్స్ఎవరికీ పంపొద్దు ..ఎస్ఎంఎస్లాక్, ఫోన్ స్క్రీన్లాక్యాక్టివేట్చేసుకోవాలి. బ్యాంక్ ట్రాన్సాక్షన్అలర్ట్ను కూడా యాక్టివేట్ చేయండి.
ఇవీ వెబ్‌సైట్స్
https://www.facebook.com/cybercrimepshyd
https://www.instagram.com/cybercrimepshyd
https://x.com/CyberCrimeshyd/
