Cyber Crime : 80 ఏళ్ల బామ్మ నుంచి రూ.21 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

Cyber Crime : 80 ఏళ్ల బామ్మ నుంచి రూ.21 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పేరిట సిటీకి చెందిన రిటైర్డ్ మహిళా ఉద్యోగి(80 )ని సైబర్ చీటర్స్ మోసగించారు. కొద్దిరోజుల కిందట ఆమె మొబైల్ నంబర్ పై హైదరాబాద్ నుంచి డ్రగ్స్ ఢిల్లీకి  పార్సిల్ అవుతున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పేరిట సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బెదిరించారు.  కేసు ఫైల్ చేయొద్దంటే ఆమె అకౌంట్ లోని నగదు ట్రాన్స్ ఫర్ చేయాలని, ఆర్బీఐ రూల్స్ మేరకు వెరీఫై చేసి, తిరిగి పంపిస్తామంటూ నమ్మించారు.

 దీంతో బాధితురాలు తన అకౌంట్ లోని రూ. 22 లక్షలు సైబర్ నేరగాళ్లు చెప్పిన అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేసింది. అనంతరం ఆమె తన కొడుకుకు విషయం చెప్పగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివ మారుతి తెలిపారు.