ఫోన్ ట్యాపింగ్ కేసు: అరెస్టయిన పోలీసులపై సైబర్ టెర్రరిజం సెక్షన్ లు

ఫోన్ ట్యాపింగ్ కేసు: అరెస్టయిన పోలీసులపై సైబర్ టెర్రరిజం సెక్షన్ లు

ఫోన్ టాపింగ్ కేసులో  మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.  అరెస్టయిన పోలీసులపై సైబర్ టెర్రరిజం సెక్షన్ లు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. దేశ భద్రతకు సాఫ్ట్ వేర్ ద్వారా ముప్పు వాటిల్లేలా చేస్తే వారిపై సైబర్ టెర్రరిజం కేసులు నమోదు చేస్తారు.  అలాంటి ఐటీ యాక్ట్ 66(F) ను ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు  ప్రయోగిస్తున్నారు.  

ఐటీ యాక్ట్ సెక్షన్ 66(F) జోడిస్తూ కోర్టులో మెమో దాఖలు  చేశారు పోలీసులు.  సెక్షన్ 66(F) కింద కేసు నిరూపణ  అయితే జీవిత ఖైదీగా శిక్ష పడే అవకాశం  ఉంది.  ఇప్పటికే ఐటీ యాక్ట్ 70 కింద కేసు  నమోదు  చేశారు.  ఐటీ యాక్ట్ 70 లో 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.  తాజాగా ఐటి యాక్ట్ సెక్షన్ 66(F) కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫోన్ ట్యాపింగ్ తో సైబర్ టెర్రరిజంకు పాల్పడినట్టు చెబుతున్నారు .

మరో వైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్ పై ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది.ఇప్పటికే  ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది.