దుర్గం చెరువు వద్ద కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

దుర్గం చెరువు వద్ద కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మొత్తం 2 లక్షల సీసీ కెమెరాలతో గస్తీ ఏర్పాటు చేశామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. గచ్చిబౌలిలోని హెచ్ఐసీసీలో జరుగుతున్న క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షోలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ... కోవిడ్ సమయంలో రియల్ ఎస్టేట్ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల రియల్ రంగం మళ్లీ పుంజుకుందన్నారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం గ్రిడ్ పాలసీ, టీఎస్ ఐపాస్, టీఎస్ బి పాస్ వంటివి తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం... సేఫ్టీ, సెక్యురిటి కి పెద్ద పీట వేస్తోందన్నారు. సైబరాబాద్ లో ప్రతిష్టాత్మక ఐటీ సంస్థలతో పాటు ఫార్మా, ఎలక్ట్రానిక్ వంటి కంపెనీలు ఉన్నాయన్న ఆయన... దుర్గం చెరువు వద్ద న్యూ టెక్నాలజీతో కూడిన కమాండ్ కంట్రోల్ రూమ్ ని సోమవారం ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ ఇష్యూతో పాటు కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ గ్రాబింగ్ వంటివి జరుగుతున్నాయని, సరికొత్త టెక్నాలజీతో సైబర్ క్రైమ్ ని అడ్డుకుంటున్నామని ఆయన చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం...

ఓయూలో రాహుల్ పర్యటన ఆగదు

బండి సంజయ్కి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ