- కొద్ది రోజులుగా మంగ్లీ ఇష్యూలో వినిపిస్తున్న పేరు
- పెట్టుబడుల పేరిట ప్రజల నుంచి భారీగా వసూళ్లు
- అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ఈఓడబ్ల్యూఎస్పోలీసులు
గచ్చిబౌలి, వెలుగు: పెట్టుబడుల పేరిట ప్రజల వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేయడం, అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి చీటింగ్చేసిన కేసులో ప్రధాన నిందితుడు రమావత్మధును సైబరాబాద్ఈఓడబ్ల్యూ పోలీసులు అరెస్ట్చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. శుభక్షేత్ర పేరుతో హేమాకాంత్రెడ్డి, రమావత్మధు, సత్యనారాయణ చౌదరి కలిసి ఓ కంపెనీ ప్రారంభించారు. తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామని ప్రజలకు ఆశ చూపారు.
పెట్టుబడులు పెడితే పటాన్చెరు, -దామరగిద్ద ప్రాంతాల్లో ఉన్న తమ వెంచర్ 102 స్క్వేర్ యార్డులో ప్లాట్ ఇస్తామని వాగ్దానం చేశారు. దీంతో పాటు నెలకు రూ. 25 వేల చొప్పున 42 నెలలు చెల్లిస్తామని ప్రలోభ పెట్టారు. అంతే కాకుండా అదనంగా రూ.5 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఇస్తామని మాయమాటలు చెప్పారు. దీంతో చాలా మంది వీరి సంస్థలో పెట్టుబడులు పెట్టారు. ఇలా 33 మంది నుంచి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేశారు.
డబ్బులు తీసుకున్న తర్వాత కొద్ది నెలలు ఇచ్చి తర్వాత ఆపేశారు. ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా, ఒప్పందాలతోనే కాలయాపన చేశారు. ఒకవేళ ఎవరైనా డబ్బులు అడిగితే బౌన్సర్లతో బెదిరింపులకు పాల్పడ్డారు. ఇలా..రూ. 5 లక్షలు ఇన్వెస్ట్చేసి మోసపోయిన సంతోష్ అనే వ్యక్తి సైబరాబాద్పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సైబరాబాద్ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మొత్తంగా బాధితుల దగ్గరి నుంచి నిందితులు ₹6.58 కోట్లు వసూలు చేశారని పోలీసులు తెలిపారు.
ఈ డబ్బును గోకుల నందన ఇన్ఫ్రా ఖాతాలకు బదిలీ చేసినట్లు గుర్తించారు. నిందితుడు మధుపై హైదరాబాద్, సైబరాబాద్పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పలు కేసులు ఉన్నాయని తెలిసింది. కొంతమందితో కలిసి సిమెంట్ఫ్యాకర్టీ, పబ్, మైక్రో ఫైనాన్స్పేరుతో రూ.200 కోట్ల వరకు కొల్లగొట్టినట్టు సమాచారం. కాగా, కొద్ది రోజులుగా సింగర్మంగ్లీ ఇష్యూలో మధుతో పాటు హేమకాంత్రెడ్డి పేర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నిందితులపై బీఎన్ఎస్318(4), 316(2), తెలంగాణ స్టేట్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ సెక్షన్ 5 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
బద్నాం చేస్తున్నరు : రమావత్ మధు
అంతకుముందు విడుదల చేసిన వీడియోలో రమావత్ మధు మాట్లాడుతూ.. మైక్రో ఫైనాన్స్ ఇష్యూలో తనను బదనాం చేస్తున్నారని, ఇష్యూలో హేమకాంత్ రెడ్డి, సరిత, అడ్వకేట్ సుబ్బారావు ముగ్గురు కలిసి ప్రజల్ని పది రోజుల నుంచి పిచ్చోళ్లను చేస్తున్నారని రమావత్మధు ఆరోపించారు. హేమకాంత్ రెడ్డి, మరో మహిళ సుబ్బారావు లది క్రిమినల్ మైండ్ అని, సరితను అరెస్టు చేసి ప్రశ్నిస్తే హేమకాంత్ రెడ్డి వద్ద ఉన్న బినామీలు బయటకు వస్తారన్నాడు. త్వరలోనే అందరి బండారం బయటపెడతానని అన్నారు.

