ఇద్దరు సైబర్ నేరగాళ్ల అరెస్టు

ఇద్దరు సైబర్ నేరగాళ్ల అరెస్టు

హైదరాబాద్​ సిటీ/ గచ్చిబౌలి, వెలుగు: సైబర్​ నేరానికి పాల్పడిని ఇద్దరిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్​ చేశారు. నగరానికి చెందిన ఓ ప్రైవేట్​ ఉద్యోగికి టెలీగ్రామ్​లో ‘బెన్ సాషా’ అనే పేరుతో సైబర్​ చీటర్లు పరిచయం అయ్యారు. ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో దశలవారీగా రూ.21,98,753 పెట్టుబడి పెట్టించారు. 

వాటిని వారికి సంబంధించిన వివిధ ఖాతాలకు మళ్లించుకుని ఫోన్​ స్విచాఫ్​ చేశారు. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబర్​  క్రైం పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో నిందితులైన తుమ్మలూరు సుధాకర్ రెడ్డి, తుమ్మలూరు రఘునాథరెడ్డిని శుక్రవారం అరెస్టు చేసినట్టు సైబర్​ క్రైం డీసీపీ సాయిశ్రీ తెలిపారు. ఈ నెల 6 నుంచి 11 వరకు మూడు కేసులు నమోదు కాగా నలుగురిని అరెస్ట్​ చేశామని చెప్పారు.