గచ్చిబౌలిలో సైబరాబాద్ సీపీ పర్యటన.. ట్రాఫిక్ నియంత్రణకు సూచనలు

గచ్చిబౌలిలో సైబరాబాద్ సీపీ పర్యటన.. ట్రాఫిక్ నియంత్రణకు సూచనలు

హైదరాబాద్ : SRDP ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల కారణంగా గచ్చిబౌలిలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ట్రాఫిక్ సరళిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పరిశీలించారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసు సిబ్బందికి సలహాలు, సూచనలు అందించారు. గచ్చిబౌలి జంక్షన్, క్యూ మార్ట్, రాడిసన్, డిలైట్, కొత్తగూడ జంక్షన్, మైండ్ స్పేస్, సైబర్ టవర్స్ మార్గాల్లోని ట్రాఫిక్ సరళిని సైబరాబాద్ సీపీ పరిశీలించారు.

పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండి... ప్రజలకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. సైబరాబాద్ సీపీ వెంట హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ హర్షవర్ధన్, మాదాపూర్ లా అండ్ ఆర్డర్ డీసీపీ శిల్పవల్లి, ఏడీసీపీ నంద్యాల నరసింహారెడ్డి, ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాస్ రెడ్డి, మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు ఉన్నారు.