హైదరాబాద్: బండి భగీరథ్ తండ్రి ఇంట్లో సైబరాబాద్ పోలీసులు తనిఖీలు చేశారు. బంజారాహిల్స్లోని బండి భగీరథ్ తండ్రి ఇంటికి సైబరాబాద్ పోలీసులు వెళ్లి ఈ తనిఖీలు చేయడం గమనార్హం. పేట్ బషీరాబాద్ పోక్సో కేసులో బండి భగీరథ్పై పోలీసులు ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. బండి భగీరథ్ హైదరాబాద్ నుంచి పారిపోకుండా పోలీసులు నోటీసులు జారీ చేసిన గంటల వ్యవధిలోనే భగీరథ్ తండ్రి ఇంటికి పోలీసులు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
బండి భగీరథ్ ఇంట్లోనే ఉండొచ్చనే అనుమానంతో పోలీసులు ఈ తనిఖీలు చేసినట్లు సమాచారం. ఏ ఎయిర్ పోర్టులో భగీరథ్ కనిపించిన తమకు సమాచారం ఇవ్వాలని లుక్ ఔట్ నోటీసుల్లో పోలీసులు ఇప్పటికే మెన్షన్ చేశారు. బండి భగీరథ కోసం పేట్ బషీరాబాద్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
