ఏఐతో ముందస్తు ట్రాఫిక్ అంచనా.. త్వరలో అమలుచేసేందుకు చర్యలు

ఏఐతో ముందస్తు ట్రాఫిక్ అంచనా.. త్వరలో అమలుచేసేందుకు చర్యలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఐ ఆధారిత ప్రిడిక్టివ్ ట్రాఫిక్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అమలు చేయడానికి చర్చించారు. పోలీస్ కమిషనర్ ఎం.రమేశ్​ఆధ్వర్యంలో ఈ విషయంపై బుధవారం సమావేశం నిర్వహించారు. యూరోపియన్ స్టాండర్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుగుణంగా ఇంటెలిజెంట్ ట్రాఫిక్ టెక్నాలజీలను ప్రవేశపెట్టే అవకాశాలను అధికారులు పరిశీలించాలని ఆయన ఆదేశించారు. ట్రాఫిక్ జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నిర్వహణ, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సామర్థ్యం, రోడ్ సేఫ్టీ మెరుగుదలలో ఈ సిస్టమ్ సహాయపడుతుందని భావిస్తున్నారు.

స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని జ్యూరిచ్ కేంద్రంగా పనిచేస్తున్న ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాలిటీ కంపెనీ సీఈఓ డాక్టర్ లూకాస్ అంబుల్ ఏఐ ఆధారిత ప్రిడిక్టివ్ ట్రాఫిక్ సొల్యూషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సిస్టమ్ ట్రాఫిక్ ప్యాటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను విశ్లేషించి, రద్దీ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, సిగ్నల్ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆప్టిమైజ్ చేస్తుందని వివరించారు. రియల్ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రాఫిక్ పరిస్థితులను ప్రిడిక్ట్ చేసి సిమ్యులేట్ చేయగల సామర్థ్యం ఉందన్నారు. ఈ సమావేశంలో డీసీపీ అడ్మిన్ టి.అన్నపూర్ణ, డీసీపీ ట్రాఫిక్ ఐ.రంజన్ రతన్ కుమార్, ఏడీసీపీ ట్రాఫిక్ మధాపూర్ హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.