యువతిలా చాటింగ్..రూ. 14 లక్షలు చీటింగ్

యువతిలా చాటింగ్..రూ. 14 లక్షలు చీటింగ్
  • నిందితుడిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు 

గచ్చిబౌలి, వెలుగు : స్నాప్ చాట్ లో యువతిగా ఫ్రెండ్​రిక్వెస్ట్ పెట్టి.. యాక్సెప్ట్ చేసిన ఐటీ ఎంప్లాయ్ నుంచి డబ్బులు వసూలు చేసిన యువకుడిని సైబరాబాద్​సైబర్​క్రైమ్​పోలీసులు అరెస్ట్​ చేశారు. ఖమ్మంకు చెందిన ఎం. అశోక్​రెడ్డి(23) బెంగళూరులో ఉంటూ బెట్టింగ్ లు, చెడు అలవాట్లకు బానిసగా మారాడు. స్నాప్​చాట్​లో ప్రణీత రెడ్డి పేరుతో ఫేక్ అకౌంట్ ద్వారా ఫ్రెండ్​రిక్వెస్ట్​పెట్టగా.. మియాపూర్​కు చెందిన ఓ ఐటీ ఎంప్లాయ్ యాక్సెప్ట్​ చేశాడు. దీంతో అతనితో అశోక్ రెడ్డి చాటింగ్​ చేస్తూ..  లవ్ చేస్తున్నానని,  పెండ్లి చేసుకుందామంటూ ప్రపోజ్ చేశాడు. 

దీంతో యువతి అనుకుని నమ్మిన తన ఫొటోలను, పర్సనల్ విషయాలను షేర్​చేశాడు. ఆ తర్వాత అశోక్​రెడ్డి ఎమర్జెన్సీగా మనీ కావాలని, బిజిసెస్​స్టార్ట్​చేస్తున్నానని రూ. 14 లక్షలు వసూలు చేశాడు. అనంతరం ఎలాంటి రెస్పాన్స్​లేకపోగా.. చీటింగ్​చేసినట్టు తెలుసుకుని ఐటీ ఎంప్లాయ్ సైబర్​క్రైమ్​పోలీసులను కంప్లయింట్ చేయగా.. కేసు నమోదు చేసి శుక్రవారం నిందితుడు అశోక్​రెడ్డిని అరెస్ట్​ చేశారు. ఇప్పటికే అశోక్​రెడ్డి మూడు సైబర్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.