టార్గెట్ మొబైల్స్ : ఒక్క ఏడాదిలోనే 50 శాతం పెరిగిన సైబర్ క్రైమ్స్

టార్గెట్ మొబైల్స్ : ఒక్క ఏడాదిలోనే 50 శాతం పెరిగిన సైబర్ క్రైమ్స్

2022తో పోలిస్తే 2023లో బెంగళూరులో సైబర్ నేరాలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఈ మేరకు సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా రిలీజ్ చేసింది.  2023లో బెంగళూరులో 17,623 సైబర్ క్రైమ్ కేసులు రాగా.. 2022లో 9,940 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. 2021లో సైబర్ క్రైమ్ కేసుల సంఖ్య 6,422గా ఉంది. మోసగాళ్లు ప్రజలను మోసం చేయడానికి కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారని, ఇది పోలీసులకు పెద్ద సవాల్‌గా నిలుస్తోందని నగర పోలీసులు చెబుతున్నారు.  

బెంగుళూరులోసైబర్ నేరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  ఇక 2023లో లైంగిక వేధింపుల 55 శాతం పెరిగాయన్నారు పోలీసులు..  మొత్తం 1,135 కేసులు నమోదయ్యాయని తెలిపారు.  లైంగిక  వేధింపులతో పాటు, హత్యలు, దోపిడీలు, ఇళ్లలో దొంగతనాలు, మోటారు వాహనాల దొంగతనాలు బాగా పెరిగాయన్నారు.  

ఏఐ టెక్నాలజీతో చేసే ఫేక్ రోబో కాల్స్ స్కామ్ ఇటీవలికాలంలో ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ పట్ట చాలా అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ చేసి ఫలానా వ్యక్తిని అని ఒకరు మీతో చెప్తే అది నిజమైన వ్యక్తి కాకపోవచ్చని తెలుసుకోవాలి. పర్సనల్ వివరాలను షేర్ చేసుకోకుండా జాగ్రత్తపడాలి.- లింక్స్‌ను క్లిక్ చేయకూడదు. అవసరమైతే స్కామ్ కాల్స్ లేదా ఇతర స్పామ్‌ మెయిల్స్‌/మెసేజ్‌లపై నేషనల్ హెల్ప్‌లైన్ 155260 కు కంప్లెయింట్ చేయొచ్చు అని పోలీసులు తెలిపారు.