
హైదరాబాద్, వెలుగు: సీబీఐ అధికారుల మంటూ ఓ రిటైర్డ్ ఉద్యోగి నుంచి సైబర్ నేర గాళ్లు రూ.34 లక్షలు కొట్టేశారు. సికింద్రాబా ద్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగికి సీబీఐ, ముం బై పోలీసుల పేరుతో ఇటీవల కాల్స్ వచ్చాయి. ‘‘మీ ఆధార్ నంబర్‌తో లింక్ అయిన ఫోన్ నంబర్ ద్వారా చట్టవ్యతిరేక ప్రకటనలు, ప్రజల ను వేధించేలా మెసేజ్‌లు పంపుతున్నారు. మీపై ఐటీ యాక్ట్‌తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. వెంటనే ముంబై లోని మా ఆఫీసుకి రావాలి” అని సైబర్ నేరగాళ్లు బెదిరించారు. తాను ఎలాంటి మెసేజీలు పంపించలేదని చెప్పినా వినిపించుకోలేదు. కేటుగాళ్లు ముంబై సీబీఐ పేరుతో ఉన్న స్కైప్ లో వీడియో కాల్ చేశారు. ఇంటరాగేషన్ పేరుతో ఆయనను భయపెట్టారు. బాధితుడి వ్యక్తిగత వివరాలు సేకరించి రూ.34 లక్షలు వసూలు చేశారు. దర్యాప్తు పూర్తయ్యాక ఆ డబ్బును తిరిగి ఇస్తామని చెప్పారు. చివరకు మోసపో యానని గుర్తించి సిటీ సైబర్ క్రైం పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు.